Asianet News TeluguAsianet News Telugu

Cyclone Gulab:విశాఖలో వర్ష భీభత్సం... కొండచరియలు విరిగిపడి మహిళ దుర్మరణం (వీడియో)

గులాబ్ తుఫాను కారణంగా విశాఖపట్నంలో కురుస్తున్న భారీ వర్షాలు ఓ మహిళ ప్రాణాన్ని బలితీసుకుంది. కొండచరియలు విరిగి ఇంటిపైపడి ఓ మహిళ దుర్మరణం చెందింది.  

women killed as heavy rain lashes Visakhapatnam
Author
Visakhapatnam, First Published Sep 27, 2021, 1:17 PM IST

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను (Cyclone Gulab) శ్రీకాకుళం జిల్లాలో తీరం దాటి బలహీనపడ్డా తెలుగురాష్ట్రాల్లో (Heavy Rains in Telugustates) వర్ష భీభత్సం మాత్రం కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా సోమవారం తెల్లవారుజామున బండరాయి జారిపడి విశాఖ (Visakhapatnam) జిల్లాలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.  

వివరాల్లోకి వెళితే... విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి మండలం నాయుడుతోటలోని సిపిఐ కాలనీ కొండవాలు ప్రాంతంలో వుంది. బారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ప్రమాదం సంభవించే అవకాశాలుండటంతో అధికారులు అప్రమత్తమయ్యాయి. ఆ కాలనీలో నివాసముండే వారిని అక్కడినుండి తరలించి ఓ పంక్షన్ హాల్ లో పునరావాసం ఏర్పాటుచేశారు.  

వీడియో

అయితే ఈ సిపిఐ కాలనీకి చెందిన తులసి భావన(31) మాత్రం భర్త అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడే నివాసముంది. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున తులసి బాత్రూంలో వుండగా కొండవాలు విరిగిపడింది. దీంతో తులసి బండరాళ్ళు, మట్టికింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది.  

read more  Cyclone Gulab:ఏపీలో వర్ష భీభత్సం... కొట్టుకుపోతున్న వంతెనలు, విరిగిపడుతున్న చెట్లు (వీడియో)

ఈ దుర్ఘటనపై సమాచారం అందడంతో వెంటనే జిల్లా కలెక్టర్, జివిఎంసి కమిషనర్, ఎమ్మార్వో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మహిళ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios