కూర విషయంలో భర్తతో గొడవపడిన భార్య తనతో పాటు ఇద్దరు బిడ్దలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా గంగవరం మండలం నీలవరానికి చెందిన దేవమణి, సూరిబాబు నాలుగేళ్ల కిందట ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు

కూర విషయంలో భర్తతో గొడవపడిన భార్య తనతో పాటు ఇద్దరు బిడ్దలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా గంగవరం మండలం నీలవరానికి చెందిన దేవమణి, సూరిబాబు నాలుగేళ్ల కిందట ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.. వీరికి పాప, బాబు ఉన్నారు..

ఈ నెల 7న రాత్రి కూర విషయంలో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది. దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన దేవమణి ఆ తర్వాతి రోజు ఉదయం భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిన తర్వాత ఇద్దరు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రానికి తీసుకెళతానని చెప్పి తిరిగిరాలేదు.

దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు .. వారి ఆచూకీ కోసం వూరంతా గాలిస్తుండగా... గ్రామ సమీపంలోని కన్నేరు వాగులో వారి మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు.. అయితే ఏడు నెలల పాప ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు కొత్త అనుమానాలు కలగడంతో.. అన్ని కోణాల నుంచి కేసును దర్యాప్తు చేస్తున్నారు.