ఈ క్రమంలో బ్యాంక్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా మహిళ డబ్బును కాజేసిన దృశ్యాలు బయటపడ్డాయి. బాధిత మహిళ బ్యాంకులోని సీసీ ఫుటేజీ ఆధారంగా.. నిందితురాలిమీద గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
కృష్ణా జిల్లా : గన్నవరం ఆంధ్రాబ్యాంక్ (Gannavaram Andhra Bank)లో భారీ చోరీ (Thieft)జరిగింది. ఇద్దరు పిల్లలతో బ్యాంక్ కు వచ్చిన ఒక మహిళ(Lady).. మరో మహిళ బ్యాగ్ లో నుంచి రూ.65 వేల రూపాయలను కాజేసింది. ఆ తర్వాత మహిళ, పిల్లలతో సహా అక్కడి నుంచి పరారయ్యింది. కాగా, బాధిత మహిళ తన బ్యాగ్ లో డబ్బులు కన్నించకపోవడంతో కంగారుగా వెతికింది.
ఈ క్రమంలో బ్యాంక్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా మహిళ డబ్బును కాజేసిన దృశ్యాలు బయటపడ్డాయి. బాధిత మహిళ బ్యాంకులోని సీసీ ఫుటేజీ ఆధారంగా.. నిందితురాలిమీద గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిలేడీ మహిళపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఓ చిన్నారి పాలిట మేనమామ కంసుడిలా మారాడు. లోకం తెలియని ఆ పసికందుకు కర్కశంగా గొంతు నులిచి చంపేశాడు.
తోలు తీయించుకోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు: పవన్‌పై ఏపీ హోంమంత్రి ఫైర్
ఈ సంఘటన క్రిష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరంలో చోటు చేసుకుంది. నాలుగు నెలల పసికందుకు వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి గొంతునులిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
ఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో ఆ వ్యక్తి మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడి గట్టాడా? లేదా స్థల వివాదాలు కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న రెడ్డిగూడెం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
