ఆమె ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసింది. తనపై కేసులు పెడుతున్నారని, నగ్నంగా పూజలు చేయించారని, తనను చాలా ఇబ్బంది పెడుతున్నారని ఆమె చెప్పడం గమనార్హం.

కర్నూలుకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. వారం రోజుల క్రితం ఆయనకు సంబంధించిన ఓ ఆడియో కలకలం రేపింది. ఆ ఆడియో క్లిప్ లో మహిళతో మూడు కోట్లకు బేరం ఆడుతున్నట్లుగా ఉండటం గమనార్హం. ఓ పెద్ద మనిషిని కలవాలని… వ్యాపారం గురించి మాట్లాడాలని, వ్యాపారంలో వాటా ఇస్తామని ఇలా చర్చించారు. ఆమె ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. మీడియా ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే మీరే వెళ్లి ఆమెను అడగండి అని సలహా ఇచ్చారు.

కాగా, తాజాగా ఆ మహిళ ఎవరు అనే విషయం బయటకు వచ్చింది. ఓ మహిళ వీడియో ఓ సెల్ఫీ వీడియో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది. ఆమె కూడా ఓ వైసీపీకి చెందని మహిళా నేతే కావడం విశేషం. ఆమె పేరు శోభారాణి. కాగా, ఆమె ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసింది. తనపై కేసులు పెడుతున్నారని, నగ్నంగా పూజలు చేయించారని, తనను చాలా ఇబ్బంది పెడుతున్నారని ఆమె చెప్పడం గమనార్హం.

ఆ వీడియోలో ఆమె పూర్తిగా ఏం చెప్పింది అంటే.. తన పేరు శోభ అని, గతంలో వన్‌టౌన్‌ ఏరియాలో ఉండేదాన్ని అని, లెక్చరర్‌గా పని పనిచేశాను అని చెప్పారు. తాను ఫ్యాషన్‌ డిజైనర్‌ గా కూడా పనిచేశానని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చి కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేశానని, ఎమ్మెల్యేతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వాపోయారు.

తాను సంవత్సరం క్రితం వన్‌టౌన్‌ సీఐ వెంకట్రామయ్య ఉద్దేశపూర్వకంగా తనపై కేసులు పెట్టారని. అందుకు సంబంధించిన సాక్ష్యాలను, హోం మినిస్టర్‌ గారికి అన్ని ఎవిడెన్సులనూ పంపించానని అన్నారు. అప్పట్లో ఎస్పీ ఫక్కీరప్ప తాను చూసుకుంటాను అని చెప్పానని, ఆ తర్వాత తనపై హత్యాయత్నం చేయించారని, దాడులు చేయించారని ఆరోపించింది.

 రెండురోజుల క్రితం కూడా తనపై కేసు పెట్టారని అన్నారు. తన వాట్సా్‌పకు ఎఫ్‌ఐఆర్‌ కాపీ పంపించారని ఆమె చెప్పారు. ఆ తర్వాత తనను హైదరాబాద్‌కు తీసుకెళ్లారని, నగ్నంగా) ఏవేవో పూజలు చేయించారని ఆమె చెప్పారు. ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో ఆప్షన్‌ లేదని, దీనంతటికి ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, కర్నూలు వన్‌టౌన్‌ సీఐ కళావెంకటరమణ, యశ్వంత్‌, సీఎంఆర్‌, జయ, ఆఫక్‌, గురువు కారణం అని ఆమె ఆరోపించారు. ఈ మేరకు మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఆమె ఆరోపణల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.