భర్త తమను పట్టించుకోవడం లేదంటూ ఇద్దరు బిడ్డలతో కలిసి అత్తింటిముందు ఆందోళనకు దిగింది మహిళ.
విశాఖపట్నం : ఇద్దరు బిడ్డలతో కలిసి ఓ తల్లి అత్తింటిముందు ఆందోళనకు దిగింది. విశాఖపట్నం గాజువాకలోని ఆజిమాబాద్ లో ఇంటిముందు కూతురు, కొడుకుతో కలిసి నిరసన చేపట్టింది మహిళ. మంచి భర్తగా ఎలాగూ వుండలేకపోయాడు... కనీసం తన పిల్లలకు తండ్రిగా అయినా వుండాలని కోరుతోంది వివాహిత. తనను, పిల్లలను భర్త పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగానని... ఇప్పటికైనా భర్త మారి తనతో రావాలని మహిళ కోరుతోంది. భర్త తనతో వస్తే ఆందోళన విరమించి ఎక్కడికైనా వెళ్లి జీవిస్తామని మహిళ చెబుతోంది.
వీడియో
