జగన్ ఫోటోకు చెప్పులదండేసి... పశువుల పేడతో పిండంపెట్టిన దళిత మహిళ (వీడియో)
అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను దళిత బిడ్డనని చెెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రెడ్డి బిడ్డగా మారిపోయాడని ఓ దళిత మహిళ మండిపడింది.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో దళితులపై జరుగుతున్న వరుస దాడులపై ఓ దళిత మహిళ వినూత్నంగా నిరసన తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోకు చెప్పుల దండ వేసి పశువుల పేడతో పిండం పెట్టింది. ఈ సందర్భంగా సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దళిత బిడ్డనని చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే రెడ్డిగా మారిపోయాడని సదరు మహిళ ఆరోపించింది. దళిత పిల్లలకు మేనమామను అవుతానని... దళిత ఆడబిడ్డలకు సోదరుడిని అవుతానని... మీ బిడ్డగా బ్రతుకుతానని చెప్పి దళితుల ఓట్లను జగన్ దండుకున్నాడని అన్నారు. కానీ ముఖ్యమంత్రి పదవి రాగానే దళితుడిగా చచ్చి రెడ్డిగా మారాడని మహిళ మండిపడ్డారు.
దళితులపై ఆకృత్యాలు జరుగుతున్నా ఈ ముఖ్యమంత్రి కనీసం స్పందించడంలేదు... ఆయన ఉన్నట్లా చచ్చినట్లా అంటే మహిళ మండిపడ్డారు. కంచికచర్లలో ఓ దళిత యువకుడిని బంధించి చితకబాదడమే కాదు ముఖంపై మూత్రం పోయడం దారుణమని అన్నారు. బ్రిటీష్ పాలనలోనూ ఇలా సాటి మనుషులపై ఉచ్చపోసిన దారుణాలు జరగలేవు... కానీ జగన్ పాలనలో జరుగుతున్నాయని అన్నారు.
వీడియో
చంద్రబాబు హయాంలో దళితులు సురక్షితంగా వున్నారని సదరు మహిళ పేర్కొంది. ఇప్పుడు జరుగుతున్నట్లు దళితులపై శిరోముండనాలు, మూత్రం పోసి అవమానించడాలు జరగలేవని.... దాడులు చేసినవారిని కఠినంగా శిక్షించారని తెలిపారు. ఇప్పుడు కూడా దళితులపై జరుగుతున్న దాడులను చంద్రబాబు, లోకేష్ ఖండిస్తున్నారని అన్నారు. కానీ జగన్ హయాంలో దళితులు, రెడ్లకు మధ్య పోరాటం జరుగుతోందని... ఇందులో దళితుల ఆత్మాభిమానం దెబ్బతీసే దారుణాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.