కొడుకుతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను సజీవదహనం చేసిన తండ్రి

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 21, Aug 2018, 2:39 PM IST
woman killed over illicit affair in kakinada
Highlights

అక్రమ సంబంధం ఓ మహిళ ప్రాణాలమీదకు తెచ్చింది. భర్త చనిపోయి ఒంటరిగా బ్రతుకుతున్నబాధితురాలు ఓ ఆటోడ్రైవర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఈ వివాహేతర సంబంధం కారణంగా తన కొడుకు చెడిపోతున్నాడని ఆరోపిస్తూ ఆటోడ్రైవర్ తండ్రి సదరు వితంతు మహిళను హతమార్చడానికి ప్రయత్నించిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలో చోటుచేసుకుంది.

రావుల మల్లీశ్వరి(21) అనే మహిళ భర్త చనిపోడంతో తన మూడేళ్ల కొడుకుతో కలిసి గురజనాపల్లిలో నివాసముంటోంది.  ఈమె క్యాటరింగ్  పనికి వెళుతూ జీవించేది. ఈ క్రమంలో క్యాటరింగ్ వస్తువులను తరలించే ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న గంగాద్రి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. వీరిద్దరు కలిసి ఓ గదిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు.

అయితే ఈ విషయం తెలిసి గంగాద్రి తల్లిదండ్రులకు మల్లీశ్వరికి మధ్య కొద్దిరోజులుగా వివాదం రేగుతోంది. ఈ క్రమంలో రెండు రోజులుగా గంగాద్రి తన వద్దకు రాకపోవడంతో మల్లీశ్వరి నేరుగా అతడి ఇంటికి వెళ్లి గొడవకు  దిగింది. దీంతో ఆవేశానికి లోనైన గంగాద్రి తండ్రి కామేశ్వరరావు మల్లీశ్వరిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో మంటల్లో కాలిపోతూ రోడ్డుపై పరుగెడుతుండగా గమనించిన స్థానికులు మంటల్ని ఆర్పేసి ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం బాధితురాలు 85 శాతం శరీరం కాలిపోయి కాకినాడ జిజిహెచ్ లో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.  

loader