Asianet News TeluguAsianet News Telugu

మహిళపై సామూహిక అత్యాచారం...గది శుభ్రం చేయడానికి తీసుకువెళ్లి.. మద్యం తాగించి.. మూడు రోజులపాటు అఘాయిత్యం..

ఓ మహిళకు బలవంతంగా మద్యం తాగించి మూడు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన విజయవాడలో వెలుగు చూసింది. ఆమెను సిగరెట్లతో దారుణంగా కాల్చారు. 

woman gang raped by 4 men in vijayawada
Author
First Published Dec 20, 2022, 9:26 AM IST

విజయవాడ : మహిళలు, ఆడపిల్లలపై అత్యాచారాల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని కఠిన చట్టాలు చేసినా వీటిలో మార్పు రావడంలేదు. అలాంటి మరో దారుణ ఘటన విజయవాడలో వెలుగు చూసింది. ఓ మహిళను గదిలో నిర్బంధించిన నలుగురు వ్యక్తులు.. మూడు రోజుల పాటు ఆమె మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన విజయవాడలో సోమవారం రాత్రి వెలుగు చూసింది. బాధిత మహిళ తీవ్ర అనారోగ్యం పాలయ్యింది. ఆమె ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో  అ చికిత్స పొందుతోంది. 

ఆమె నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద కూలిపని చేసుకుని బతుకుతుంది. అదే ప్రాంతంలో సులభ్ కాంప్లెక్స్ లో పనిచేసే వ్యక్తి ఆమెకు పరిచయం. ఆ పరిచయంతో ఆమెను నమ్మించి డిసెంబర్ 17న కానూరు సనత్ నగర్ లో ఉన్న ఓ గదికి తీసుకు వెళ్ళాడు. అక్కడికి వెళ్లాక కానీ ఆమెకు తాను మోసపోయానని విషయం అర్థం కాలేదు. తప్పించుకోవడానికి ప్రయత్నించినా వీలవ్వలేదు. అప్పటికే అతనితోపాటు అక్కడ మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వారంతా మద్యం తాగారు. ఆమెకు కూడా బలవంతంగా తాగించారు. మూడు రోజులపాటు ఆమెపై  దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

ప్రియుడిని చంపి, డ్రమ్ములో కుక్కి.. అడవిలోకి తీసుకెళ్లి తగలబెట్టి.. ఓ ప్రియురాలి ఘాతుకం..

నలుగురు వ్యక్తులు కలిసి మహిళకు బలవంతంగా మద్యం తాగించి మూడు రోజుల పాటు అత్యాచారం చేశారు.  సిగిరెట్లతో వొళ్ళంతా క్రూరంగా కాల్చారు. ఇప్పటి వరకు మద్యం మత్తునుండి ఆ మహిళ ఇంకా కోలుకోలేదు. బెంజ్ సర్కిల్లో నివాసం ఉండే మహిళ రోజువారీ కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తోంది. సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజి దగ్గర్లోని సనత్ నగర్ లో నివాసం ఉండే రవి... రోజువారీ కూలీగా బెంజ్ సర్కిల్ దగ్గర ఉండి కూలి పనులకు వెళ్తూ ఉంటాడు. రవి 10 రోజుల పని నిమిత్తం వేరే ఊరు వెళ్ళివచ్చాడు. దీంతో సనత్ నగర్లోని అతని రూమ్ మొత్తం చెత్త పేరుకుపోయిందనిశుభ్రం చేయడానికి ఎవరినైనా చూడమని స్నేహితులకు చెప్పాడు.

వారు బాధిత మహిళను రూమ్ శుభ్రం చేయడానికి మాట్లాడుకుని రూమ్ కి తీసుకువచ్చారు. అనంతర ముగ్గురు స్నేహితులతో కలిసి మద్యం సేవించి లక్ష్మిపై అత్యాచారం చేశారు. అయితే బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో భయంతో వారు పారిపోయారు. ఆమె సోమవారం విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. దీంతో ఈ అమానుషమైన అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆస్పత్రి వర్గాలు పెనమలూరు పోలీసులకు సమాచారం అందించారు. 

సమాచారం అందిన వెంటనే ఆసుపత్రికి వచ్చిన పోలీసులు బాధితురాలి తో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆమె చెప్పిన  వివరాల ప్రకారం సోమవారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆమెను తీసుకు వచ్చి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలించి, వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios