గుంటూరు: ఇద్దరు ప్రియురాళ్ల మోజులో ఓ ఎస్ఐ తనను పట్టించుకోవడం లేదని భార్య ఎస్పీని ఆశ్రయించింది.  ఈ ఘటన కూడ గుంటూరు జిల్లాలో చోటు చేసుకొంది. వివాహేతర సంబంధాలు, లైంగిక వేధింపుల ఆరోపణలతో గుంటూరు జిల్లాలో ఇప్పటికే ముగ్గురు పోలీసులు సస్పెన్షన్‌కు గురయ్యారు. తాజాగా ఈ ఘటన వెలుగు చూడడం కలకలం రేపుతోంది.

గుంటూరు జిల్లాలో ఎస్ఐ గా పనిచేస్తున్న ఎస్ఐ‌పై భార్య ఎస్పీకి సోమవారం నాడు ఫిర్యాదు చేసింది. ఇద్దరు యువతులతో ఎస్ఐ సంబంధాలు పెట్టుకొని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది. 

Also readవివాహేతర సంబంధం:గుంటూరులో సీఐ వెంకట్ రెడ్డి సస్పెన్షన్

ఇద్దరు ప్రియురాళ్లతో తాను ఉంటూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కూడ ఈ కేసును తొక్కిపెట్టారని ఆమె ఆరోపిస్తోంది. తన భర్త కారణంగా   తన కుటుంబానికి హని ఉందని ఆమె ఆరోపించారు.

అయితే  తన భార్య తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని  ఎస్ఐ చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటికే ఇద్దరు ఎస్ఐలు, మరో సీఐపై   ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటేశారు.