అప్పటికే పెళ్లైన వ్యక్తిని ప్రేమించిందో యువతి. ఇంట్లో తామిద్దరికీ పెళ్లి చేయమని అడిగింది. ఒప్పుకోకపోవడంతో పురుగుల మందు తాగా ఆత్మహత్యకు పాల్పడింది.
పెదబయలు : ప్రేమించిన వ్యక్తితో marriage జరగదని మనస్థాపానికి గురైన యువతి suicideకు పాల్పడింది. ఎస్సై మనోజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెదబయలు మండలం లింగేశ్వర పంచాయతీ వనకుంతురు గ్రామానికి చెందిన కర్ణ అనురాధ (32), విశాఖలోని సుజాత నగర్ కు చెందిన ఓ గుత్తేదారు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈయన లింగేటి పంచాయతీ పరిధిలో నిర్మాణాలు చేస్తున్నారు. ఈ నెల 23న వీరిద్దరూ పెళ్లి చేసుకుంటామని అనురాధ తల్లిదండ్రులకు చెప్పింది. అతడికి ఇప్పటికే వేరే మహిళతో వివాహం అయ్యింది.
దీంతో ఆమె తల్లిదండ్రులు దీనికి అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆదివారం తల్లిదండ్రులు పక్క గ్రామానికి వెళ్లగా… ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి కృష్ణారావు ఇంటికి వచ్చేసరికి కూతురు వాంతులు చేసుకుంటూ ఉండడంతో వెంటనే జి.మాడుగుల ఆసుపత్రికి.. అక్కడి నుంచి పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో మృతి చెందింది.
ఇదిలా ఉండగా, మార్చి 21న ఓ భర్త అవమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ వివాహిత మరొకరితో extramarital affair పెట్టుకుంది. భర్తకు తెలిసి మందలించినా ఆమెలో మార్పు రాలేదు. wife చేసిన మోసం అతడిని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఈ క్రమంలో వివాహిత lover, కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి గొడవ చేయడంతో ఇక బతకొద్దని నిర్ణయించుకుని తనువు చాలించాడు. మృతుడి కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గొల్లపల్లికి చెందిన జెరిపోతుల హనుమాండ్లు- దేవమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వీరి చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి దేవమ్మే పిల్లలను పెంచి పెద్ద చేసింది. చిన్న కుమారుడు గంగాధర్ (35)కు పదేళ్ల కిందట తిరుపతమ్మతో పెళ్ళి జరిపించింది. వీరికి ప్రమోద్ అనే కొడుకు ఉన్నాడు.
కాగా, తిరుపతమ్మ పెళ్ళయిన రెండేళ్ళకే health issuesతో మృతి చెందింది. తరువాత గంగాధర్ పెగడపల్లి మండలం సంచర్లకు చెందిన మమతను second marriage చేసుకున్నాడు. గ్రామంలో వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ పెళ్లి జరిగి ఆరేళ్ల అయినా ఈ దంపతులకు సంతానం కలగలేదు. ఈ క్రమంలో మమత జెరిపోతుల అభిషేక్ అనే ఎదురింటి యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. అయినా మమతా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అభిషేక్ తో పాటు అతని కుటుంబసభ్యులను మందలించాడు.
ఈనెల 11న మమత తన ప్రియుడితో కలిసి గంగాధర్ కు పట్టుబడింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. గత శనివారం రాత్రి అభిషేక్, అతని కుటుంబ సభ్యులు గంగాధర్ ఇంటికి వచ్చి గొడవ చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఆదివారం వేకువజామున ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి, తల్లి దేవమ్మ బోరున విలపించింది. అక్రమ సంబంధం మానుకోవాలని ఎన్నిసార్లు మందలించినా కోడలు వినలేదని తెలిపింది. ఆమె ప్రియుడు, కుటుంబ సభ్యులు తమను చంపేస్తామని బెదిరించారని, అందువల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు మమత అభిషేక్ లపై కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు.
