వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఏలూరు తంగెళ్లమూడికి చెందిన కుసుమ నాగసాయి(30)కి 2014లో నిడదవోలు మండలం తాళ్లపాలేనికి చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే.. అంతకుముందే ఆమె ఏలూరు గన్ బజార్ కు చెందిన షేక్ నాగూర్(28) ని ప్రేమించారు. పెళ్లి తర్వాత కూడా ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఉన్నారు.

నాగూర్ ఎవరికీ తెలీకుండా నిడదవోలు వచ్చి మరీ ఆమెను కలిసి వెళ్లేవాడు. ఆదివారం కూడా అలాగే తాళ్లాపాలెం రాగా.. వీరికి కుసు బంధువు ఒకరు ఆమె భర్తకు తెలీకుండా గది ఏర్పాటు చేశారు. అయితే.. వీరిద్దరూ ఓకే గదిలో గడుపుతున్నారన్న విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది.

దీంతో వారిద్దరినీ ఒకే గదిలో బంధించి.. అతను స్థానికులను పిలుచుకుొచ్చాడు. దీంతో.. అందరికీ తమ బంధం తెలిసిపోతుందనే భయంతో కుసుమ, నాగూర్ ఎలుకల మందు తినేశారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు.

తలుపులు తెరచి చూడగా ఇద్దరూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.