ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరిముందే ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది.
గుంటూరు : ఏ దిక్కూ లేక ప్రభుత్వ స్థలంలో నివసిస్తున్న తమను అధికార పార్టీ నాయకుల అండతో ఓ వ్యక్తి వేధిస్తున్నాడని గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరుకు చెందిన మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తూ నీచంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఆమె కన్నీటిపర్యంత అయ్యింది. అతడి నుండి తమను కాపాడాలంటూ కాకుమాను మండల సర్వసభ్య సమావేశంలో పురుగుమందు డబ్బాతో మహిళ ఆందోళనకు దిగింది.
వీడియో
కొండపాటూరుకు చెందిన అనురాధ అదే గ్రామానికి చెందిన నిడబ్రోలు సుబ్బారావు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మండల సర్వసభ్య సమావేశంలోనే పురుగులమందు తాగుతున్న ఆమెను ప్రజాప్రతినిధులు, అధిరకారులు అడ్డుకున్నారు. ఇప్పటికయినా తన బాధ అర్థం చేసుకుని వేధిస్తున్న సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని... తన ఇంటికి దారి వదలేలా చూడాలని అనురాధ కోరుతోంది.
