దిశ హత్యోదంతం మరవకముందే అలాంటి సంఘటన కోకొల్లలుగా బయటకు వస్తున్నాయి. ఓ తల్లి, అప్పుడే పుట్టిన బిడ్డను చంపి అనంతరం తగలపెట్టారు. ఈ దారుణ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే....ప్రకాశం జిల్లా పేర్నమిట్ట గ్రామ శివారులో బుధవారం ఉదయం రెండు శవాలు బయటపడ్డాయి. అందులో ఒకరు తల్లి కాగా.. మరోటి అప్పుడే పుట్టిన ఆడ శిశువుది కావడం గమనార్హం.

మృతదేహాలు ఎవరివీ అన్నది ఇంకా తేలలేదు. కాగా... పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా... ఇద్దరినీ హత్య చేసి ఆ తర్వాత తగలపెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. మహిళ తలపై గట్టిగా మోది హత్య చేసినట్లు తెలుస్తోంది. సదరు యువతి వయసు 20 నుంచి 25ఏళ్ల లోపు ఉంటుందని తెలుస్తోంది.