న్యాయం చేయాలంటూ.. కొద్ది రోజులుగా  స్టేషన్ వద్ద పడిగాపులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని యువతి వాపోయింది.

గుంటూరు : తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. స్టేషన్ ఎస్సై బాలకృష్ణ యాదవ్ తనను ప్రెమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ బాధిత యువతి ఆరోపిస్తోంది.

"

న్యాయం చేయాలంటూ.. కొద్ది రోజులుగా స్టేషన్ వద్ద పడిగాపులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని యువతి వాపోయింది. దీంతో చేసేది లేక స్టేషన్ ముందు బైటాయించి, ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పుకొచ్చింది.

యువతి ప్రయత్నాన్ని గమనించి పోలీసులు అడ్డుకున్నారు. యువతి ఇచ్చిన ఫిర్యాదు తీసుకొని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిఐ శేషగిరిరావు హామీ ఇచ్చారు.