తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ కోడలు ఘాతుకానికి తెగబడింది. ప్రియుడితో కలిసి అత్తను హతమార్చి గోదారిలో పడేసింది. ఈ దారుణ ఘటన కాకినాడలో జరిగింది.
కాకినాడ : extramartial affairకి అడ్డంగా ఉందని ఆగ్రహంతో ఓ మహిళను.. ముగ్గురు వ్యక్తులు కలిసి murder చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు మంగళవారం ఈ విషయం మీడియాకు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. సామర్లకోట మండలంలోని జి మేడపాడుకు చెందిన బత్తిన మాణిక్యం మార్చి 19 నుంచి కనిపించడం లేదు. దీనిపై ఆమె భర్త మార్చి 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సై టి సునీత missing కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
కృష్ణ, మాణిక్యం దంపతుల కుమారుడు గతంలో మరణించాడు. అతడి భార్య.. అత్త వారి ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు అదే గ్రామానికి చెందిన వందే వెంకన్న అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటోందని అక్కసుతో మాణిక్యాన్ని ఆమె కోడలు, వెంకన్నలు హతమార్చారని పోలీసులు నిర్ధారించారు. ఆమెను చంపేసిన తరువాత ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి గోదావరి కాలువలో పడేశారు.
ఇందుకు బంది పోలయ్య అనే వ్యక్తి సహాయం తీసుకున్నారని గుర్తించారు. వీఆర్ఓ యేడిద భరత్ సమక్షంలో నిందితులు ఈ విషయాన్ని అంగీకరించారని ఎస్ఐ తెలిపారు. ఈ నేపథ్యంలో మాణిక్యం అదృశ్యం కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. నిందితులు ముగ్గురినీ మంగళవారం కోర్టులో హాజరు పరచి 14 రోజుల రిమాండ్ కు తరలించారు. మాణిక్యం మృతదేహం ఎక్కడ ఉందో గుర్తించి, స్వాధీనం చేసుకుని, డీఎన్ఎ టెస్టుకు పంపాలని ఎస్సై తెలిపారు.
కాగా, మే 26న నోయిడాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మహిళ తన భర్తను murder చేసేందుకు ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఈ కేసులో మహిళ సహా ముగ్గురిని పోలీసులు arrest చేశారు. దీనికోసం నిందితులు liquor మత్తులో ఉన్న వ్యక్తిని ఇటుకతో మోది హత్య చేశారు. ఈ ఘటన Greater Noidaలోని దంకౌర్ ప్రాంతంలోని డియోటా గ్రామంలో జరిగింది.
ఓ మహిళ తన ప్రేమికుడితో కలిసి తన భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నింది. ఈ కేసుకు సంబంధించి మహిళ, ఆమె ప్రేమికుడితో సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మే 19న ఆ ప్రాంతంలోని పశువైద్యశాల సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విచారణలో మృతుడిని సతీష్‌గా గుర్తించారు.
వివరణాత్మక దర్యాప్తు తర్వాత, నిందితులలో ఒకరైన రామ్‌కిషోర్‌ను పోలీసులు జీరో-ఇన్ చేశారు. అతనికి మృతుడి భార్య పూజకు వివాహేతరసంబంధం ఉంది. దీంతో తమ సంబంధానికి భర్త అయిన సతీష్ అడ్డుగా ఉన్నాడని భావించి.. హత్య చేసేందుకు పథకం పన్నారు. ఈ మేరకు కుట్ర పన్ని, సతీష్ ను హత్య చేశారు. పక్కా ప్లాన్ వేసి, రామ్‌కిషోర్ తన స్నేహితుడు మంజీత్‌తో కలిసి సతీష్ ను హత్య చేసినట్లు అంగీకరించాడు.
ఇద్దరు నిందితులు సతీష్‌ను ఓ చోటికి పిలిపించి అతడికి మద్యం తాగించారు. ఆ తరువాత మత్తులోకి జారుకున్నాక ఇటుకతో తల మీద పదే పదే కొట్టి చితకబాదారు. అనంతరం సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు మృతదేహాన్ని పొదల్లో దాచిపెట్టి, పరారయ్యారు.
