కర్నాటకలోని మండ్యలో దారుణం జరిగింది. వదినా, మరదలి మధ్య చెలరేగిన చిన్న గొడవ..ఆ ఇద్దరి ప్రాణాలను తీసింది. వదినను బండరాయితో కొట్టి చంపిన మరదలు ఆపై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

కర్నాటకలోని మండ్యలో దారుణం జరిగింది. వదినా, మరదలి మధ్య చెలరేగిన చిన్న గొడవ..ఆ ఇద్దరి ప్రాణాలను తీసింది. వదినను బండరాయితో కొట్టి చంపిన మరదలు ఆపై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

ఈ విషాద ఘటన మండ్య తాలూకాలోని కంబదహళ్లిగ్రామంలో శనివారం రాత్రి చోటు చోటుచేసుకుంది. వివరాలు… గిరీష్ భార్య ప్రియాంక (35), కాగా, గిరీష్ సోదరి గీత (25). ప్రియాంకకు గతంలో రెండు సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ గర్భం నిలిచినట్టే నిలిచి అబార్షన్ అయ్యింది. ఇటీవల ప్రియాంక మళ్లీ గర్భం దాల్చింది. దీంతో భార్య భర్తలు కలిసి మండ్యలో ఆసుపత్రి వెళ్లి పరీక్షలు చేయించుకుని వచ్చారు.

కాగా, మరదలు గీత బెంగుళూరు లో ఉండేది కరోనా వల్ల ఆమె భర్త చనిపోయాడు. దీంతో రెండు నెలల కిందట వచ్చి అన్నయ్యగిరీష్ వద్ద ఉంటుంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ప్రియాంకకు, గీతకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ప్రియాంక తాను ఇక ఇక్కడ ఉండలేనని, పుట్టింటికి వెళ్ళిపోతానని గది లోకి వెళ్ళి బట్టలు సర్దుకుంటు ఉండగా, వెనకాల నుండి బండ రాయి తీసుకొని వచ్చిన గీత వదిన తల పైన గట్టిగా కొట్టింది.

దీంతో తీవ్ర గాయమై కిందపడిపోయిన ప్రియాంక ప్రాణాలు వదిలింది. దీంతో భయపడిన గీత మరో గదిలోకి వెళ్లి చీరేబ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొంతసేపటికి ఇంట్లోని వారు, ఇరుగుపొరుగు గమనించి బసరాలు పిఎస్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించి మృతదేహాలను మండ్య ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.