ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే కర్కశంగా కడతేర్చిందో ఇల్లాలు. దీనికి ప్రియుడూ సహకరించాడు. చంపిన తరువాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసినట్టుగా చిత్రీకరించబోయింది. కానీ విషయం బైటపడడంతో నిందితురాలిగా తేలింది.
ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే కర్కశంగా కడతేర్చిందో ఇల్లాలు. దీనికి ప్రియుడూ సహకరించాడు. చంపిన తరువాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసినట్టుగా చిత్రీకరించబోయింది. కానీ విషయం బైటపడడంతో నిందితురాలిగా తేలింది.
ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. దర్శి డీఎస్పీ కె.ప్రకాశరావు చెప్పిన ప్రకారం మండల కేంద్రం సంతమాగులూరుకు చెందిన దంపతులు చెన్నుపల్లి శ్రీనివాసరావు (45), సైదాలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.
18 నెలల క్రితం గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నల్లగంగుల వెంకటరెడ్డితో సైదాలక్ష్మికి పరిచయం ఏర్పడింది. క్రమంగా అది కాస్తా అక్రమ సంబంధంగా మారింది. విషయం భర్తకు తెలియడంతో ఇంట్లో తరుచూ గొడవలు జరుగుతుండేవి.
తీరు మార్చుకోవాలని పలుమార్లు ఆమెను భర్త మందలించాడు. దీంతో ఆమె ప్రియుడితో కలిసి భర్తను అంతమెందించాలని పథకం వేసింది. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీ రాత్రి శ్రీనివాసరావు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత ఇంట్లో నిద్రించాడు.
సైదాలక్ష్మి ముందే వేసుకున్న పథకం ప్రకారం భర్త కాళ్లు పట్టుకొని కదలకుండా చేయగా ప్రియుడు పీక నొక్కి శ్రీనివాసరావును హతమార్చారు. తర్వాత ఆమె భర్తే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. మృతుడి తమ్ముడు చెన్నుపల్లి వీరయ్య ఫిర్యాదు మేరకు సంతమాగులూరు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.
పోస్టుమార్టం నివేదిక ఆధారంగా శ్రీనివాసరావుది హత్యగా నిర్థారించారు. వీఆర్వో వద్ద నిందితురాలు సైదాలక్ష్మి నేరం అంగీకరించింది. దీంతో మంగళవారం నిందితురాలిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 30, 2020, 10:30 AM IST