కడపలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లీ కూతురు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడప శంకరాపురం రామాలయం వీధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. 

కడపలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లీ కూతురు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడప శంకరాపురం రామాలయం వీధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. 

కడపకు చెందిన శ్రావణి(34), కూతురు తన్విక (8)తో కలిసి శంకరపురంలో ఉంటోంది. శ్రావణి కి 10 సంవత్సరాల క్రితం వివాహం అయింది. గత ఐదేళ్లుగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. దీంతో కూతురితో కలిసి విడిగా ఉంటోంది. శ్రావణి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తోంది. 

గురువారం ఉదయం శ్రావణి తన కూతురితో కలిసి బెడ్ రూంలోని ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న చిన్న చౌక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 

చిన్నచౌకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లీకూతుళ్ల మృతికి గల కారణాల మీద ఆరాతీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.