గుంటూరులో విషాదం చోటు చేసుకుంది. తొమ్మిది నెలల కూతురితో కలిసి బిల్డింగ్‌పై నుంచి తల్లీ ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. నగరంలోని లక్ష్మీపురం కమలేష్ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున మనోజ్ఞ అనే వివాహిత.. శనివారం ఐదో అంతస్తు నుంచి తన 9 నెలల చిన్నారి తులసిని కిందకు తోసేసింది.

అనంతరం తాను కూడా కిందకి దూకింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. వీరిద్దరిని గమనించిన స్థానికులు రక్తపు మడుగులో పడివున్న మనోజ్ఞను ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మనోఙ్ఞ దంపతులు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా వీరు గుంటూరు వచ్చారు. కుటుంబ కలహాల నేపథ్యంలో మనోజ్ఞ ఆత్మహత్యకు పాల్పడి వుంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే తమ అల్లుడే కూతుర్ని, మనవరాలిని చంపేసి వుంటాడని మనోజ్ఞ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.