నాటు వైద్యమే, ఆయుర్వేదం కాదు: ఆనందయ్య మందుపై రాములు
బొనిగె ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు కీలక ప్రకటన చేశారు. ఆనందయ్య మందును నాటు మందుగానే పరిగణిస్తామన, ఆయుర్వేద మందుగా పరిగణించబోమని ఆయన చెప్పారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న మందును నాటు మందుగానే గుర్తించినట్లు ఆయుష్ కమిషనర్ రాములు చెప్పారు. ఆనందయ్య ఇచ్చేది ఆయుర్వేదం కాదని ఆయన అన్నారు. రెండు రోజుల పాటు రాములు నేృతృత్వంలోని వైద్య బృందం నెల్లూరు జిల్లాలో పర్యటించి ఆనందయ్య తయారు చేస్తున్న మందులను పరిశీలించింది. పర్యటనకు ముందే హైదరాాబదు ల్యాబ్ లో మందను నమూనాలను పరీక్ష చేయించింది.
ఆ ఫలితాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ఆనందయ్య ఇచ్చిన వివరాల ఆధారంగా దానని నాటుమందుగానే గుర్తించామని రాములు అన్నారు. వంశపారంపర్యంగా మందులు ఇస్తుంటారని, ఆనందయ్య ఇచ్చేది ఆ క్రమంలో వచ్చిన నాటు మందు అని ఆయన అన్నారు. మందు తయారీలో ఎటువంటి హానికరమైన పదార్థాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
కళ్లలో వేసే చుక్కలకు కూడా సాధారణ పదార్థాలనే వాడుతున్నారని ఆయన చెప్పారు. మందు హానికరం కాదని తాము నిర్ణయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. మందు రోగులపై పనిచేస్తుందా లేదా అనేది విజయవాడ - తిరుపతి ఆయుర్వేద డాక్టర్ల బృందం తేలుస్తుందని ఆయన చెప్పారు.
సిసీఆర్ఎసీ (సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్) అనే కేంద్ర ప్రభుత్వం సంస్థకు ఈ డాక్టర్ల బృందం నివేదిక పంపుతుందని ఆయన చెప్పారు. అన్ని నివేదికలు వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీ పై నిర్ణయం తీసుకుంటుందని రాములు చెప్పారు.
రోగుల లో డ్రాప్స్ వల్ల ఆక్సిజన్ పెరిగినట్లు ప్రాథమికంగా సమాచారం ఉందని అన్నారు. పసరు వైద్యం పొందిన కొందరి ఆరోగ్యం పైనా డాక్టర్ల బృందం పరిశీలన ఉంటుందని చెప్పారు.