జగన్ పిచ్చిగాని ప్రత్యర్ధుల సవాలుకు స్పందించే వ్యక్తి చంద్రబాబు ఎందుకవుతారు?

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సవాలును చంద్రబాబునాయుడు స్వీకరిస్తారా? ప్రజాతీర్పు టిడిపికి అనుకూలంగా ఉంటే 21 మంది ఫిరాయింపు ఎంఎల్ఏలను వెంటనే రాజీనామా చేయించాలని తాజాగా జగన్ సవాలు విసిరారు. స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులను ప్రలోభాలకు గురిచేసి, ఒత్తిళ్ళు పెట్టి వైసీపీ ఓటర్లను తమకు అనుకూలంగా చంద్రబాబు ఓట్లు వేయించుకున్నారంటూ జగన్ ఆరోపణలు చేసారు. స్ధానిక సంస్ధల ఎన్నికల విజయంపై చంద్రబాబు కామెంట్లు చేసారు. ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పారు. అందుకు స్పందిస్తూ జగన్ పై సవాలును విసిరారు.

ఫిరాయింపు ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించాలని ఎప్పటి నుండో వైసీపీ డిమాండ్ చేస్తున్నదే. అయితే, రాజీనామా విషయంలో మాత్రం చంద్రబాబు స్పందించటం లేదు. ప్రలోభాలకు, ఒత్తిళ్ళకు గురిచేసి స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులను ఓట్లు వేయించుకోవటం గొప్పకాదంటూ జగన్ సిఎంను ఎద్దేవా చేసారు. నిజంగానే అంత ధైర్యముంటే, 21 మంది ఫిరాయింపు ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించి ప్రజాతీర్పును కోరాలని డిమాండ్ చేసారు. ఆ ఎన్నికల్లో వచ్చే తీర్పును తాను రెఫరండంగా అంగీకరిస్తానంటూ జగన్ సవాలు విసిరారు.

నిజమైన ప్రజాతీర్పుకు తామే స్పూర్తిగా జగన్ చెప్పుకున్నారు. తమకు బలం లేని జిల్లాల్లో తాము పోటీకి దిగలేదన్నారు. నిజమే, ఉభయగోదావరి జిల్లాలతో పాటు చిత్తూరు, అనంతపురం జిల్లాలో వైసీపీ పోటీ పెట్టలేదు. బలంలేని జిల్లాలో పోటీ పెట్టటంపై ఇదే చంద్రబాబు ఒకపుడు తీవ్రంగా ఆక్షేపించారు. ప్రజాస్వామ్యం విలువల గురించి ఎన్నో లెక్చర్లు దంచారు అప్పట్లో. కానీ తాను అధికారంలోకి వచ్చేసరికి అవేవీ గుర్తుకురాలేదు. దాంతో జగన్ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేకపోయారు. తప్పుడు విధానాలు అనుసరిస్తున్నందుకు చంద్రబాబు రాజీనామా చేయాలని కూడా జగన్ డిమాండ్ చేసారు. అయినా జగన్ పిచ్చిగాని ప్రత్యర్ధుల సవాలుకు స్పందించే వ్యక్తి చంద్రబాబు ఎందుకవుతారు?