టిడిపి, వైసీపీ అభ్యర్ధుల్లో ఎవరు గెలుస్తారనే విషయంలో ఎవరి లెక్కలు వారికున్నాయి. అభ్యర్ధుల గెలుపు కోసం రెండు పార్టీలు ప్రతిష్టను ఫణంగా పెట్టి మరీ పోరాడుతున్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న పోటీలో డబ్బు ప్రస్తావన లేకుండా ఉంటుందా?
‘ఓటుకు నోటు’...తెలుగునాట బాగా పాపులరైన మాట. ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో తెలంగాణాలోని ఓ నామినేటెడ్ ఎంఎల్ఏ ఓటును కొనుగోలు చేయబోయే టిడిపి అడ్డంగా దొరికిపోయినటిడిపి, వైసీపీ అభ్యర్ధుల్లో ఎవరు గెలుస్తారనే విషయంలో ఎవరి లెక్కలు వారికున్నాయి. అభ్యర్ధుల గెలుపు కోసం రెండు పార్టీలు ప్రతిష్టను పణంగా పెట్టి మరీ పోరాడుతున్నాయి.
నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న పోటీలో డబ్బు ప్రస్తావన లేకుండా ఉంటుందా? సంగతి అందరికీ తెలిసిందే. సరే, తర్వాత జరిగిన పరిణామాలు కూడా అందరికీ గుర్తుందికదా? ఇపుడామాట ఎందుకంటారా? చాలాకాలం తర్వాత మళ్ళీ అదేమాట తాజాగా వినబడుతోంది లేండి. ఎక్కడంటారా? ఇంకెక్కడ నంద్యాలలో. ఉపఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది కదా? అందుకే ప్రధాన పార్టీలు జాగ్రత్తపడుతున్నాయ్.
టిడిపి, వైసీపీ అభ్యర్ధుల్లో ఎవరు గెలుస్తారనే విషయంలో ఎవరి లెక్కలు వారికున్నాయి. అభ్యర్ధుల గెలుపు కోసం రెండు పార్టీలు ప్రతిష్టను పణంగా పెట్టి మరీ పోరాడుతున్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న పోటీలో డబ్బు ప్రస్తావన లేకుండా ఉంటుందా? ప్రస్తుత రోజుల్లో సర్పంచ్ గాఎన్నికవ్వాలన్నా డబ్బు మూటలు విప్పాల్సిందే కదా? అటువంటిది దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నంద్యాల ఉపఎన్నికలో డబ్బు ప్రస్తావన లేకుండా ఎలాగుంటుంది? అందుకే డబ్బును విచ్చలవిడిగా వెదజల్లుతున్నారట.
ఈ విషయంలో రెండు పార్టీలూ ఒకే దారిలో నడుస్తున్నా, అధికారంలో ఉందికదా? సహజంగానే టిడిపికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఎంతలేదన్నా ప్రభుత్వ యంత్రాంగం చెప్పుచేతల్లో ఉంటుంది. దాన్ని అడ్డుపెట్టుకుని టిడిపి చెలరేగిపోతోందట. ఇప్పటికే వివిధ రూపాల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట. గడచిన మూడు రోజులుగా అయితే నియోజకవర్గంలో ఎక్కడ అవసరమనుకుంటే అక్కడ కోట్ల రూపాయలు చల్లేస్తోందట.
పలుచోట్ల ఓటుకు రూ. 5 వేలు కూడా ముట్టచెబుతున్నట్లు సమాచారం. ‘తాను తలచుకుంటే ఓటుకు రూ. 5 వేలు కూడా ఇవ్వగలను’ అని ఆమధ్య చంద్రబాబు అన్నమాట గుర్తుందికదా? ఆమాటను సిఎం యధాలాపంగా అనలేదన్న విషయం ఇపుడు అర్ధమవుతోంది.
ఒక దశలో వైసీపీ ధాటికి తెలుగుదేశంపార్టీ కుదేలైపోయింది. టిడిపి ఎంత గింజుకున్నా గెలిచేది కల్లే అన్న ప్రచారమూ జరిగింది. అందుకే వైసీపీ శ్రేణులపై వరుసబెట్టి దాడులు కూడా చేస్తోంది. అయినా ఉపయోగం లేకపోవటంతో సామాజికవర్గాల్లో పట్టున్న నేతలను రంగంలోకి దింపింది.
పనిలో పనిగా మీడియాకూ ఎరేస్తోంది లేండి. ఈ ఎన్నికల్లో గెలిచినా వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి చేయగలిగేది ఏమీ లేదనే ప్రచారాన్ని ఉధృతం చేయటంతో పాటు అదనంగా డబ్బు మూటలను విప్పుతోందట. దెబ్బతో టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మనందరెడ్డి గెలుపు ఖాయమని ప్రచారం ఊపందుకుంది. అంతా బాగానే ఉంది కానీ ఓటర్లు ఏమి చేస్తారో చూడాలి..!
