ఆస్తి కోసం కట్టుకున్న భర్తపై ఓ మహిళ వేడివేడి మసిలే నీటిని పోసింది. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

ఆస్తి కోసం కట్టుకున్న భర్తపై ఓ మహిళ వేడివేడి మసిలే నీటిని పోసింది. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... విజయవాడ అయోధ్యనగర్ కి చెందిన అట్టూరి వెంకట రమణ(49) హైదరాబాద్ లో భవన నిర్మాణ పనులు చేస్తుంటాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వెంకట రమణకు 18ఏళ్ల క్రితం హేమలతతో వివాహమైంది. హేమలత.. నగరపాలక సంస్థ పాఠశాలలో హిందీ టీచర్ గా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. గత కొంతకాలంగా భార్య, భర్తల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి.

భర్తపేరిట ఉన్న ఆస్తిని.. తన పేరిట, పిల్లల పేరిట రాయాల్సిందిగా హేమలత కొంతకాలంగా వెంకట రమణను వేధించడం మొదలుపెట్టింది. అతను నిరాకరించడంతో.. భర్తపై వేడి వేడీ మసిలే నీటిని మీద పోసేసింది. దీంతో.. అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.