Asianet News TeluguAsianet News Telugu

సోషల్ మీడియాలో భార్య అసభ్య వీడియోలు.. పిల్లలకు విషమిచ్చి.. తానూ తాగిన భర్త... ఇద్దరి పరిస్థితి విషమం...

అది విషం అన్న విషయం తెలియని పిల్లలు.. తండ్రి కూడా తాగడంతో వారూ తాగడానికి ప్రయత్నించారు. కానీ అది చేదుగా ఉండడంతో.. పదేళ్ల చిన్న కుమారుడు మాత్రమే మందు తాగాడు. మిగతా ఇద్దరూ తాగలేదు. వారితో బలవంతంగా తాగించేలోపే.. అతను అపస్మారక స్థితికి చేరుకోవడంతో వారిని వదిలేశాడు. 

Wife obscene videos on social media, husband poisoning children and suicide attempted in East Godavari
Author
Hyderabad, First Published Jan 17, 2022, 7:53 AM IST

సీతా నగరం :  తన భార్య వేరే వ్యక్తితో కలిసి ఉన్న అసభ్యకర దృశ్యాలు social mediaల్లో రావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన భర్త విషం తాగి,  పిల్లలతోనూ తాగించాడు. దీంతో అతనితోపాటు పదేళ్ల కుమారుడు 
Life-threatening conditionలో కొట్టుమిట్టాడుతున్నారు. 
East Godavari జిల్లా సీతానగరం ఎస్ఐ శుభ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. వంగలపూడికి చెందిన 30 ఏళ్ల వివాహిత ఉపాధి నిమిత్తం కువైట్లో ఉంటుంది.  ఆమె  భర్త స్వగ్రామం గోకవరంలోనూ.. ఇద్దరు కుమారులు (13,10), కుమార్తె (12) అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు.  తండ్రి అప్పుడప్పుడూ వెళ్లి  పిల్లల్ని చూసి వస్తుంటాడు.  

ఇదే క్రమంలో శనివారం సాయంత్రం పండగ అని చెప్పి వంగలపూడి వెళ్లాడు తండ్రి. ఇంట్లో కాసేపు గడిపి.. ఆతరువాత  తన ముగ్గురు పిల్లలను బయటకు తీసుకు వెళ్ళాడు. నేరుగా వారికి గ్రామంలోని తోటలు ఉండే ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ నిర్జనంగా ఉన్న ప్రాంతానికి వెళ్లి.. తనతో పాటు తీసుకెళ్లిన Rat poisonను.. ముందుగా తాను తాగేశాడు. తర్వాత ముగ్గురు పిల్లలతో తాగించే ప్రయత్నం చేశాడు.  

అయితే అది poison అన్న విషయం తెలియని పిల్లలు.. తండ్రి కూడా తాగడంతో వారూ తాగడానికి ప్రయత్నించారు. కానీ అది చేదుగా ఉండడంతో.. పదేళ్ల చిన్న కుమారుడు మాత్రమే మందు తాగాడు. మిగతా ఇద్దరూ తాగలేదు. వారితో బలవంతంగా తాగించేలోపే.. అతను అపస్మారక స్థితికి చేరుకోవడంతో వారిని వదిలేశాడు. అయితే తండ్రికి, తమ సోదరుడికి ఏం జరిగిందో తెలియని పిల్లలు అమాయకంగా అలాగే కూర్చున్నారు. కొద్దిసేపటికి వారిని అటుగా వెడుతున్న కొందరు స్థానికులు గమనించారు. 

వారికి విషయం అర్థం అయ్యింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్ఐ శుభ శేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని..  బాధితులను హుటా హుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం ఆదివారం వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మిగతా ఇద్దరు పిల్లలు సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమీప బంధువుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో వచ్చిందని.. దాంతో తాను మనస్థాపానికి గురై ఇలా చేశానని బాధితుబు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో చెప్పాడు. అయితే అతడు చెబుతున్న వీడియో పరిశీలించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అతడు ఆటో నడుపుతాడని.. గతంలో అతను చోరీలకు పాల్పడినట్లు గోకవరంలో అతడిపై కేసులు ఉన్నాయని తెలిపారు.  కేసు నమోదుచేసి  దర్యాప్తు  చేస్తున్నట్లు తెలిపారు.

చేదు మందు తాగించబోయాడు...
‘నాన్న ఎప్పుడూ మమ్మల్ని పట్టించుకోడు. అమ్మమ్మ ఇంటి వద్దే ఉండి చదువుకుంటున్నాం. నాన్న అప్పుడప్పుడు వచ్చి చూసి వెడుతుంటాడు. అలాగే పండుగకు వచ్చాడు. బయటకి వెళ్దాం అంటే.. సరదాగా బయలుదేరాం’ అని మిగతా ఇద్దరు పిల్లలు చెప్పారు.  ఆ తరువాత తమను తోటలోకి తీసుకెళ్లి బలవంతంగా తమతో ఏదో చేదు మందు తాగించే ప్రయత్నం చేశాడని,  తామిద్దరం నిరాకరించగా,  తమ్ముడు తెలియకుండా తాగేశాడు అని వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios