నిత్యం మద్యం సేవించి వేధిస్తున్నాడని... ఓ భార్య.. కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. నిద్రపోతుండగా... తల మీద బండరాయితో మోది చంపేసింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా దుర్గిలోని ఇందిరమ్మ కాలనీలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... పగడాల శ్రీనివాసరావు(50)కి భార్య విజయలక్ష్మి,  ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులు ఇద్దరూ వేరే ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. కాగా... శ్రీనివాసరావు..  మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ పోషణ కోసం ఇద్దరు కుమారులు.. తల్లి విజయలక్ష్మికి డబ్బులు పంపిస్తూ ఉంటారు. అయితే... వాటిని కూడా శ్రీనివాసరావు.. తాను మద్యం తాగడానికి ఖర్చు పెడుతూ ఉండేవాడు.

భార్యకు ఖర్చులకు కూడా ఇవ్వకుండా వేధించేవాడు. దీంతో.....అతని వేధింపులు ఆమె తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో భర్త నిద్రపోతున్న సమయంలో బండరాయితో తలపై మోది హత్య చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.