అక్రమసంబంధం భర్తకు తెలిసి పోయిందని అక్క కొడుకుతో కలిసి భర్తనే హత్య చేసిందో భార్య. తరువాత తనే వెళ్లి ఫిర్యాదు చేసింది చివరికి అడ్డంగా దొరికిపోయింది. క్రైమ్ సినిమా లెవల్ లో సాగిన ఈ ఘటన తెనాలిలో జరిగింది.

తెలంగాణలోని నల్గొండ మిర్యాల గూడకు చెందిన భార్యభర్తలు తెనాలిలో స్థిరపడ్డారు. భర్త రాడ్ బెండింగ్ పనిచేస్తాడు. భార్యకు కొద్దికాలం క్రితం శివనాగార్జున అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీనికి ఆమె అక్కకొడుకు సాయికుమార్ సహకరించేవాడు.

అయితే కొద్దికాలంగా భర్తకు భార్యమీద అనుమానం రావడంతో ఆమెను ప్రశ్నిస్తూ కొడుతుండేవాడు. అలాగే సాయికుమార్ ని కూడా బాగా కొట్టాడు. దీంతో సాయికుమార్ కి భర్తతో ప్రాణ హాని ఉందని అందుకే భర్తను ఎలాగైనా చంపాలని నిశ్చయించుకుంది. వెంటనే సాయికుమార్, శివనాగార్జునతో కలిసి మరో ముగ్గురి సాయం తీసుకున్నారు. 21వతేదీ ఉదయం మూడు గంటలకు నిద్రపోతున్న సాయి కుమార్ నోరు మూసి కత్తులతో పొడిచి చంపేశారు.

ఆ తరువాత తన భర్త రోజూ కొడుతుండడంతో చూడలేన సాయికుమార్ చంపేశాడని ఆ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే గీత లాగితే డొంకంతా కదిలినట్టుగా విచారణలో మొత్తం విషయం బైటికి వచ్చింది. పోలీసులే షాక్ అయ్యారు. భార్యతో పాటు సాయికుమార్, శివనాగార్జున మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. తండ్రిని తల్లి చంపడంతో ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు.