Asianet News TeluguAsianet News Telugu

భర్తను వశం చేసుకోవడం కోసం మంత్రగాడి హత్య.. రెండో భార్యమీద నేరం నెట్టి..చివరికి..

ఓ భార్య తన భర్తను దక్కించుకోవడం కోసం దారుణానికి ఒడిగట్టింది. వశీకరణ పూజలు చేయమంటూ పిలిచి, మంత్రగాడినే హతమార్చింది. 

wife kill a witch for husband in nellore - bsb
Author
First Published Jul 17, 2023, 8:11 AM IST | Last Updated Jul 17, 2023, 8:20 AM IST

నెల్లూరు : ఎనిమిది నెలల క్రితం నెల్లూరులో వెలుగు చూసిన గోనె సంచిలో మృతదేహం హత్య కేసులో మిస్టరీ వీడింది. భర్త కోసం ఓ భార్య మంత్రగాడినే హత్య చేసింది. అంతేకాదు ఈ హత్య కేసులో అతని రెండో భార్యని ఇరికించాలని ప్రయత్నించింది. చివరికి పోలీసులకు దొరికిపోయింది. రెండో భార్య జైలుకు వెళితే భర్త తనకే దక్కుతాడని మొదటి భార్య ఆలోచన చేయడంతో జరిగిన జాతకం ఇది. ఈ కేసు చిక్కుముడిని పోలీసులు తాజాగా ఛేదించారు.

ఆదివారం నెల్లూరు డిఎస్పి శ్రీనివాసరెడ్డి మీడియాకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జహీర్ భాషా నెల్లూరు  ఎన్సీపీ కాలనీకి చెందిన వ్యక్తి.  ఆయనకు ఆ కాలనీలో మెడికల్ షాప్ ఉంది. ఆ మెడికల్ షాప్ లో కావ్య అలియాస్ సమీరా పనిచేసేది.  ఆమెకు అంతకుముందే పెళ్లయి భర్త చనిపోయాడు. ఆమెను  జహీర్ భాషా పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే మొదటి వివాహం ద్వారా ఆమెకు ఓ కుమార్తె ఉంది.

చేపలు పట్టుకునే విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న...!!

కొంత కాలానికి జహీర్ భాషా.. అస్మా అనే మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో సమీరా దగ్గరికి రావడం తగ్గిపోయింది. దీంతో భర్త తన దగ్గరే ఉండాలని.. తన దగ్గరకు రావడం కోసం.. మరో ఇద్దరితో కలిసి ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా.. వశీకరణ పూజలు చేసే మణికంఠ (33) అనే వ్యక్తిని కలిసింది. అతను కృష్ణాజిల్లా కలిదిండి మండలంలో ఈ పూజలు నిర్వహిస్తుంటాడు.

అతడిని నెల్లూరుకు పిలిపించింది. భర్త తన దగ్గరకు వచ్చేలా పూజలు చేయాలని కోరింది. మణికంఠ సరే అన్నాడు. ఆ సమయంలో సమీరా మనసులో మరో ఆలోచన బెదిరింది. అస్మాను అడ్డు తొలగించుకుంటే భర్త తనను వదిలిపోడని ఆలోచన చేసింది. దీనికోసం తన స్నేహితురాలు కృష్ణవేణి,  కుమార్తె సాయిప్రియలతో కలిసి ప్లాన్ వేసింది.

పూజలు చేయడానికి ఒప్పుకున్న మణికంఠను.. చంపేసి ఆ నేరం  ఆస్మామీదికి నెట్టేద్దామని.. అప్పుడు ఆమె జైలు పాలు అవుతుందని పథకం వేశారు. దీంతో జహీర్ భాషా తన దగ్గరికి రాకుండా ఉండలేని పరిస్థితి వస్తుందని అనుకున్నారు. నిరుడు నవంబర్ ఒకటవ తేదీన మణికంఠను ఇంటికి పిలిచారు. ఆరోజు రాత్రి ఇంటికి వచ్చిన మణికంఠకు పాలలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చారు. మోతాదుకు మించి నిద్ర మాత్రలు కలపడంతో మణికంఠ చనిపోయాడు.

ఆ తర్వాత చనిపోయాడని నిర్ధారించుకుని.. అతని  మృతదేహాన్ని  గోనెసంచిలో కుక్కారు. అంతకుముందే.. ఈ హత్యకు అస్మాని కారణమంటూ ఓ నకిలీ ఉత్తరం రాసి.. మణికంఠ జేబులో పెట్టారు.  ఆ తర్వాత ఆ గోనెసంచిని జహీర్ భాషా ఇంటిదగ్గర పడేశారు. నవంబర్ రెండవ తేదీన ఈ విషయం వెలుగు చూడడంతో.. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మృతుడి గురించి వివరాలు సేకరించారు. ఆ తర్వాత వారి దర్యాప్తులో మణికంఠ మృతికి సమీరానే కారణమని తెలిసింది. అంతేకాదు ఆమెకు ఈ క్రమంలో కుమార్తె సాయిప్రియ, స్నేహితురాలు కృష్ణవేణి  సహకరించారని తెలిసి.. వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios