గుంటూరు: తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ తన భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ప్రియుడితో కలిసి పక్కా పథక రచన చేసి భర్తను మట్టుపెట్టింది.. రూ.10 లక్షల సుపారీ ఇచ్చి భర్తను చంపించింది. ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 

హత్యకు సంబంధించిన వివరాలను గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ శనివారం మీడియాకు వివరించారు. గుంటూుర జిల్లా పెదకూరపాడు మండంల 75 తాళ్లూరుకు చెందిన బాష్యం బ్రహ్మయ్య (42) గ్రామంలోనే హోటల్, పాల దుకాణం నడుపుతూ వస్తున్నాడు. ఈ నెల 4వ తేదీన గ్రామ శివారులో ఇద్దరకు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను అడ్డగించి ముఖంపై విషపూరితమైన రసాయనాలు చల్లి దాడికి ప్రయత్నించారు. 

వారి నుంచి తప్పించుకున్న బ్రహ్మయ్య దగ్గరలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. వారు ఆయనను ఆస్పత్రికి తరలించేలోగా మధ్యలోనే మరణించాడు. ఈ కేసును ఛేదించడానికి పెదకూరపాడు పోలీసులు సంఘటన జరిగిన రోజు రాత్రి 10 గంటల సమయంలో అక్కడి టవర్ లోకేషన్ కు వచ్చారు. ఫోన్ కాల్స్ లిస్టును సేకరించారు. 

బ్రహ్మయ్య హత్యకు ముందు ఆయన భార్య సాయికుమారి ఫోన్ నుంచి అదే గ్రామానికి చెందిన యువకుడు అశోక్ రెడ్డికి కాల్ వెళ్లినట్లు గుర్తించారు. ఆ సమయంలోనే ఈ టవర్ నుంచి కృష్ణా జిల్లా మచిలీపట్నానికి కాల్స్ వెళ్లాయి. ఆ కాల్స్ డేటాను బట్టి మరోసారి సాయికుమారిని పోలీసులు విచారించారు. ఈ విచారణలో ఆమెకు అశోక్ రెడ్డితో ఉన్న అక్రమ సంబంధం బయటపడింది. 

బ్రహ్మయ్యను చంపేందుకు మచిలీపట్నానికి ెచందిన పవన్ కుమార్, షేక్ షరీఫ్ లకు సాయికుమారి, అశోక్ రెడ్డి రూ.10 ల్కషల సుపారీ ఇస్తామని చెప్పారు. కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారు. తమ పథకంలో భాగంగా వారు రోల్డు గోల్డు తయారీలో వాడే సెనైడ్ ను బిస్కట్ లో కలిపి ఓ కుక్కకు తినిపించారు. అది కొద్ది సేపట్లోనే మృత్యువాత పడింది. 

ఆ తర్వాత బ్రహ్మయ్యను చంపేందుకు రెక్కీ నిర్వహించారు ఆ రోజు రాత్రి బ్రహ్మయ్యపై సెనైడ్ చల్లి పారిపోయారు. ఆ ప్రభావంతోనే బ్రహ్మయ్య మరణించినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ హత్య కేసులో నలుగురిని పోలీసుుల అరెస్టు చేశారు.