దారుణం: నోట్లో గుడ్డలు కుక్కి భార్యకు చిత్రహింసలు

Wife harassed by husband in Kurnool district
Highlights

భార్యపై  భర్త పైశాచికం

కర్నూల్: కర్నూల్ జిల్లా కృష్ణగిరి మండలంలో భార్యపై వేధింపులకు పాల్పడుతున్న
భర్తపై బాధితురాలు ఎట్టకేలకు ఫిర్యాదు చేసింది.మద్యానికి భానిసగా మారిన భర్త  
అనుమానంతో భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. 


కర్నూల్ జిల్లా కృష్ణగిరి మండలంలోని పెనుమాడ కు చెందిన రాజు అనే వ్యక్తి  14 నెలల
క్రితం ఓ యువతిని వివాహం చేసుకొన్నాడు. కొన్నాళ్ళ పాటు వారు బాగానే ఉన్నారు.  కానీ,
భార్యపై అతను అనుమానం పెంచుకొన్నాడు.

అంతేకాదు మద్యాానికి బానిసగా మారాడు. ప్రతి రోజూ ఇంటికి వచ్చి భార్యపై దాడి
చేసేవాడు. ఆమెను కొట్టి తాను ఆనందం పొందేవాడు. ప్రతి రోజూ ఇలానే చేస్తున్నాడు.

జూన్ 4 వతేదిన బాగా మద్యం తాగొచ్చిన రాజు భార్య శరీరంపై ఎక్కడ పడితే కాల్చి
వాతలు పెట్టాడు. ఆమె  అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి   చిత్రహింసలు పెట్టారు.

భర్త ఇంట్లో లేనిసమయంలో ఆమె బయటకు వచ్చింది. అంగన్వాడీ కార్యకర్త ఆమెకు
ఆసుపత్రిలో చికిత్స చేయించింది.పోలీసులకు ఫిర్యాదు చేయించింది. నిందితుడి కోసం
పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

loader