గుంటూరు: కట్టుకున్న భర్తను రూ.10లక్షల సుపారీ ఇచ్చి చంపించిందో కసాయి భార్య. తన అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడని ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. చివరకు విషయం బయటపడి మహిళతో  పాటు ఆమె ప్రియుడు, సుపారీ గ్యాంగ్ కటకటాలపాలయ్యారు. 

ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం తాళ్లూరుకు చెందిన భాష్యం బ్రహ్మయ్య-సాయికుమారి భార్యాభర్తలు. బ్రహ్మయ్య గ్రామంలోనే పాలవ్యాపారం చేస్తూ ఓ హోటల్ ను కూడా నడిపిస్తున్నాడు. అయితే అతడి భార్య సాయికుమారి అదే గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డితో పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.  

భార్య వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన బ్రహ్మయ్యకు పలుమార్లు ఆమెను మందలించాడు. దీంతో తమ విషయం బయటపడే ముందే అతడి అడ్డు తొలగించుకోవాలని సాయికుమారి, శేఖర్ రెడ్డి భావించారు. దీంతో సుపారీ గ్యాంగ్ తో అతన్ని చంపించేందకు పూనుకున్నారు. 

మచిలీపట్నంకు చెందిన పవన్ కుమార్, షేక్ షరీఫ్ లతో బ్రహ్మయ్యను చంపడానికి రూ.10లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కొంత నగదును అడ్వాన్స్ గా ఇచ్చి మిగతామొత్తాన్ని హత్య అనంతరం ఇస్తామని మాట్లాడుకున్నారు. దీంతో బ్రహ్మయ్య హత్యకు రంగంలోకి దిగిన పవన్, షరీఫ్ లు రోల్డుగోల్డు తయారీలో వాడే సైనైడ్‌ను ఈ హత్యకు ఉపయోగించారు. 

రాత్రి బ్రహ్మయ్యపై బ్రహ్మయ్య ఒంటరిగా వెళుతున్న సమయంలో అతన్ని వెంబడించి సైనైడ్‌ చల్లారు. దీంతో అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యి చనిపోయాడు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయికుమారి, శేఖర్ రెడ్డి, పవన్, షరీఫ్ లను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.