తన భార్యతో మరో వ్యక్తి సహజీవనం చేస్తున్నాడని ఆగ్రహంతో.. సదరు వ్యక్తిని బండరాయితో మోది హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లా, రామసముద్రం మండలం నారిగానిపల్లె పంచాయతీలో గురువారం రాత్రి జరిగింది.  

ఎస్ ఐ రవి కుమార్ కథనం మేరకు దిగువలంభంవారిపల్లెకు చెందిన వెంకటరమణ కుమార్తె ఆదిలక్ష్మికి, పుంగనూరు మండలం ఆరడిగుంట గ్రామానికి చెందిన మునియప్ప కుమారుడు అర్జున్ కు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

కాగా నాలుగేళ్ల నుంచి వీరిద్దరూ గొడవల కారణంగా విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం తాలూకు చెందిన శ్రీనివాసులు అలియాస్ అంజప్ప తో ఆదిలక్ష్మి కి పరిచయం ఏర్పడింది. మనసులు కలవడంతో ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. 

కరోనా భయంతో నీటి సంపులో దూకి ఆత్మహత్య: శవాన్ని తీయడానికి వెనకంజ...

ఇద్దరి సహ జీవనం వ్యవహారం భర్త అర్జున్ కి తెలియడంతో గురువారం రాత్రి ఆదిలక్ష్మి ఇంటికి వెళ్లాడు. నిద్రిస్తున్న ఆంజప్పపై బండరాయితో మోది పారిపోయాడు. ఇది గమనించిన ఆదిలక్ష్మిగట్టిగా కేకలు వేసింది.

ఆ కేకలు విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని గాయపడిన ఆంజప్పను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం తిరుపతికి రెఫర్‌ చేశారు. అయితే మార్గమధ్యలో అతను మృతి చెందాడు. 

మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. పలమనేరు డీఎస్పీ గంగయ్య, సీఐ మధుసూదన్ రెడ్డి శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.