Asianet News TeluguAsianet News Telugu

నా భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్న.. ఓ భార్య ఆవేదన..

భర్త వేధింపులు తాళలేక ఓ భార్య హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె ఎనిమిదేళ్ల చిన్నారి అనాథగా మారిపోయాడు. 

wife committed suicide over husband harassment in krishna district
Author
First Published Nov 4, 2022, 6:48 AM IST

కృష్ణా జిల్లా : రెండు నిమిషాల క్రితం తనతో మాట్లాడి తను వాకిట్లోకి వెళ్లొచ్చేసరికి ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించిన తల్లిని చూసి ఎనిమిదేళ్ల కుమారుడు ఉమేష్ గుండెలవిసేలా ఏడుస్తుంటే ఓదార్చడం ఎవ్వరివళ్లా కాలేదు. అతని ఏడుపు చూసి ఇరుగుపొరుగువారు కన్నీటిపర్యంతమయ్యారు. ఫోన్ చేస్తే వెంటనే వచ్చి తమ ఇంటికి తీసుకెళ్లేవాళ్లమే తల్లీ అంటూ మృతురాలి తల్లి విలపిస్తున్న తీరు స్థానికుల్ని కలిచివేస్తుంది. పమిడిముక్కల మండలం వీరంకిలాకులో గురువారం ఉదయం పాముల ప్రియాంక (33) ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భర్త పాముల పవన్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్ లో హెంగార్డుగా పనిచేస్తున్నారు. 

అయ్యన్నపాత్రుడికి ఊరట.. కుమారుడితో సహా బెయిల్, న్యాయం గెలిచిందన్న చంద్రబాబు

తోట్ల వల్లూరు మండలం పాముల్లంకకు చెందిన పవన్ కుమార్ కు నందివాడ మండలం పోలుకొండకు చెందిన ప్రియాంకకు 2014లో వివాహం అయ్యింది. వారికి ఉమేష్ అనే 8 సంవత్సరాల కుమారుడున్నాడు. 8 నెలల క్రితమే పమిడిముక్కల స్టేషన్ కు బదిలీపై వచ్చి వీరంకిలాకులో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం పవన్ రాత్రి డ్యూటీలో ఉన్నాడు. ప్రియాంక్ ఉదయం తన కుమారుడిని బాత్రూంకు వెళ్లి రమ్మని పంపి లోపల తలుపులకు గడియ వేసుకుంది. కొద్ది నిమిషాల తరువాత వెనక్కి వచ్చి కుమారుడు తలుపు కొట్టగా ఎంత సేపటికీ తీయలేదు.

పక్కన కిటికీలోంచి చూసి తన తల్లి ఉరేసుకుందంటూ బోరున ఏడవడంతో స్థానికులు వచ్చి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ కేఎన్ వీ సత్యనారాయణ సిబ్బందితో వెళ్లి తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లేసరికే ఆమె విగతజీవిగా మారిందన్నారు. మృతురాలివద్ద దొరికి లెటర్ లో ‘తన భర్త తనను ఎన్నో ఏళ్లుగా మానసికంగా, శారీరకంగా వేదిస్తున్నందుకే భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, కుమారుడిని మాత్రం తన భర్త వద్ద ఉంచొద్దని, తన అన్న వద్దకు పంపాలని’ అందులో ఉటంకించినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి సత్తా మణి ఇచ్చిన ఫిర్యాదులో తన అల్లుడు పవన్ కుమార్ తరచూ హించింసేవాడని ప్రియాంక తమ వద్ద  బాధపడేదని, తాము సర్దిచెప్పి పంపేవాళ్లమని పేర్కొంది. దీంతో పవన్ కుమార్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ కేఎన్ వీ సత్యనారాయణ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios