తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో ఓ వ్యక్తి ప్రేయసితో రాసలీలలు జరుపుతూ భార్యకు రెడ్ పట్టుబడ్డాడు. తిరుపతిలోని పద్మావతి నగర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. భర్త తన ప్రేయసితో ఉండగా బంధువులతో వచ్చి భార్య అతన్ని పట్టుకుంది.

చంద్రమౌళి అనే వ్యక్తి తన ప్రేయసితో ఉండగా ఆ సంఘటన జరిగింది. భార్యను చూసిన చంద్రమౌళి భవనం రెండో అంతస్థు నుంచి దూకి పరుగు లంకించుకున్నాడు. 

చంద్రమౌళి గతంలో కాల్ మనీ కేసులో అరెస్టు కూడా అయ్యాడు. డబ్బులు ఎర వేసి పలువురు మహిళలతో అతను అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. తన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రమౌళి బార్య ఆందోళనకు దిగింది.