సెలవులపై ఇంటికి వచ్చిన ఆర్మీ జవాన్ ను కట్టుకున్న భార్య అతి కిరాతకంగా హతమార్చిన దారుణం అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.

రాయచోటి : జీవితాంతం కలిసి జీవించాల్సిన భర్తను అతి కిరాతకంగా హతమార్చిందో ఇల్లాలు.కట్టుకున్న మొగుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవదహనం చేసింది. ఈ అమానుష ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం పూజారివాండ్లపల్లె గ్రామానికి చెందిన శ్రీధర్ భారత ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చిన అతడిపై భార్య మమత హత్యాయత్నానికి పాల్పడింది. ఇంట్లో నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది మమత. దీంతో ఒళ్లంతా మాటలు అంటుకోవడంతో బాధ భరించలేక గట్టిగా అరుస్తూ బయటకు వెళ్లాడు. అతడి అరుపులు విన్న కుటుంబసభ్యులు, చుట్టుపక్కల ఇళ్లవారు మంటలు ఆర్పారు. అప్పటికే శరీరమంతా కాలిపోయి కొన ఊపిరితో వున్న శ్రీధర్ ను కుటుంబసభ్యులు చికిత్స కోసం బెంగళూరుకు తరలించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో మార్గ మధ్యలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. 

Read More టిడిపిలో తిరిగితే చంపేస్తామని వైసిపి బెదిరింపులు... జూ.ఎన్టీఆర్ వీరాభిమాని సెల్ఫీ సూసైడ్ (వీడియో)

ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు మమతను అరెస్ట్ చేసారు. ఆమె భర్తను చంపడానికి గల కారణాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.