Asianet News TeluguAsianet News Telugu

భర్త కొత్తచీర కొనివ్వలేదని.. మనస్తాపంతో భార్య ఆత్మహత్యాయత్నం..

పెళ్లి రోజున కొత్త చీర కొనివ్వలేదని ఓ భార్య మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. 
 

wife attempted suicide over her husband did not buy her a new saree in kakinada
Author
hyderabad, First Published Aug 17, 2022, 5:59 PM IST

కాకినాడ : పెళ్లి రోజున కొత్త చీర కొనలేదని మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. గొల్లప్రోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేబ్రోలుకు చెందిన మరిపూడి శ్రీనివాసరావుకు శంఖవరం మండలం నెల్లిపూడి చెందిన పద్మినితో 2017లో వివాహం అయింది. ఈ నెల 11న చేలో పని పూర్తి చేసుకుని పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన భర్తను పెళ్లిరోజు, వరలక్ష్మి ఒకే రోజు వస్తుందని.. తనకు కొత్త చీర కొనివ్వమని పద్మిని అడిగింది.

ప్రస్తుతం కొంత ఇబ్బందిగా ఉందని తాను ఇప్పుడు కొనలేనని అతడు సమాధానం చెప్పాడు. తోటి వారందరూ వరలక్ష్మీ వ్రతానికి కొత్త చీరలు కొనుక్కుంటున్నారు అని.. ఆ రోజు పెళ్లి రోజు కూడా అయినందున తనకు చీర కొనాలి అని కోరింది. ఈ నేపథ్యంలో దంపతులిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్న పద్మిని చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఉంది.

చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారాలోకేష్ లపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

పద్మిని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోవడం గమనించిన భర్త కేకలు వేయగా..  బంధువులు, స్థానికులు పరుగున వచ్చి ఆమెను కిందికి దించారు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స తరువాత కాకినాడలో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తల్లి రమణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఆగస్ట్ 11న అన్నా చెల్లెలుగా ఉంటున్న తమ మీద ప్రేమికుల అంటూ ముద్ర వేశారని మనస్తాపం చెందిన ఓ ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ లో జరిగింది. మూడో ఠాణా ఎస్సై  భాస్కరాచారి తెలిపిన వివరాల ప్రకారం.. నందిపేట్ కు చెందిన యువకుడు (22) నిజామాబాదులో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (17)  నిజామాబాదులో పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతోంది.

విజయవాడలో టీడీపీ కార్పొరేటర్‌ దుర్గ కొడుకు అరెస్ట్..

ఒకే ఊరు కావడంతో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరూ తరచుగా మాట్లాడుకుంటూ ఉండటం, కలుసుకుంటూ ఉండటంతో కొంతమంది వీరిని ప్రేమికులు అంటూ  ప్రచారం చేయడం మొదలు పెట్టారు. దీంతో వీరిద్దరు మనస్తాపం చెందారు. తామిద్దరూ అన్నాచెల్లెళ్లలాగా ఉంటున్నామని..  ఇలా ప్రచారం చేయడంతో  తాము తీవ్రంగా బాధ పడ్డామని ఉత్తరం రాసి.. ఈ నెల 8న.. రాత్రి 8 గంటలకు జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కాలేజీ దగ్గరికి చేరుకున్నారు. అక్కడే ఇద్దరు  గడ్డి మందు తాగి  ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.  

అయితే అటుగా వెడుతున్న స్థానికులు వీరిని గుర్తించారు. వీరి ప్రయత్నం గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు బుధవారం ఉదయం మృతి చెందాడు. బాలిక ఆసుపత్రిలో కోలుకుంటోంది. మూడో ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Follow Us:
Download App:
  • android
  • ios