అర్థరాత్రి బెడ్రూంలో ప్రియుడితో దొరికిపోయిన భార్య.. భర్త నిలదీశాడని చేసిన పని...
ప్రియుడితో సన్నిహితంగా ఉంటూ భర్తకు పట్టుబడిన ఓ వివాహిత... అతడిని అత్యంత దారుణంగా హతమార్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లి గూడెంలో జరిగింది.

తాడేపల్లిగూడెం :వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భార్య అత్యంత దారుణానికి ఒడిగట్టింది. సంక్రాంతి పండుగ వేళ కుటుంబంతో కలిసి సంతోషంగా గడపాల్సింది పోయి.. ప్రియుడి మీద మోజుతో.. అతనితో కలిసి భర్తను హతమార్చింది. భర్తను విచక్షణా రహితంగా కొట్టింది. దీంతో అతడు చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి మంగళగిరి సీఐ అంకమ్మరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…మంగళగిరి పట్టణానికి చెందిన వింజమూరు క్రాంతి కుమార్ కు ఏడేళ్ల క్రితం ఏలూరుకు చెందిన గంగాలక్ష్మితో వివాహం అయ్యింది. క్రాంతి కుమార్ (32) బంగారం పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
క్రాంతికుమార్ గంగాలక్ష్మీ లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శనివారం అర్ధరాత్రి వరకు షాపులో పనిచేసిన క్రాంతి కుమార్ ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య గంగాలక్ష్మి ఏలూరుకు చెందిన మరిడయ్య అనే సమీప బంధువుతో బెడ్ రూమ్లో అత్యంత సన్నిహితంగా ఉండడం కనిపించింది. అది చూసి క్రాంతి కుమార్ నిర్ఘాంత పోయాడు. కోపం పట్టలేక భార్యతో గొడవకు దిగాడు. మరిడయ్యను నిలదీశాడు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇదే సమయంలో గంగాలక్ష్మితో పాటు మరిడయ్య కలిసి క్రాంతి కుమార్ ను ఇంటి బయటకి తీసుకువచ్చారు. వీరికి ఇంకో వ్యక్తి తోడయ్యాడు. వేరే ముగ్గురు కలిసి క్రాంతి కుమార్ ను రాడ్లతో విచక్షణ రహితంగా కొట్టారు.
శ్రీహరికోటలో విషాదం: రెండు రోజుల క్రితం మృతి చెందిన సీఐఎస్ఎఫ్ ఎస్ఐ భార్య సూసైడ్
ఆ దెబ్బలకు తట్టుకోలేక క్రాంతి కుమార్ గట్టిగా అరుస్తూ అక్కడే పడిపోయాడు. గొడవ గలాటా, క్రాంతి కుమార్ అరుపులు విన్న చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే వారు వచ్చేసరికి క్రాంతికుమార్ చనిపోయాడు. స్థానికులను గమనించిన గంగా లక్ష్మి, ప్రియుడు మరిడయ్యతో కలిసి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే గొడవ వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న వారు గంగా లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన మీద విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో గంగా లక్ష్మి ప్రియుడు మరిడయ్య, వారికి సహకరించిన మరో వ్యక్తి పరారై పోయారు. క్రాంతి కుమార్ సోదరుడు హరికృష్ణ ఘటన మీద మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గంగా లక్ష్మీ మరిడయ్య మధ్య పెళ్లికి ముందు నుంచే అక్రమ సంబంధం కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా గంగాలక్ష్మి ఆదివారం ఉదయం పండుగకు భర్తతో కలిసి ఏలూరులోని పుట్టింటికి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మరిడయ్య ఇక్కడికి రావడం.. ఒకటేసారిగా క్రాంతి కుమార్ ను చంపడం.. ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి హఠాత్తుగా జరిగిపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ముందస్తుగా పథకం వేసుకుని..మరిడయ్య క్రాంతి కుమార్ ను హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.