తాగిన మత్తులో గొడవ పడి భార్య, స్నేహితులు కలిసి ఓ వ్యక్తిని చంపేసిన దారుణ ఘటన అనంతపురంలో జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ ఆర్ఎం కార్యాలయం ఆవరణలో ఈ నెల ఒకటో తేదీన కన్న అలియాస్ కట్టా కన్నాచారి హత్యకు గురయ్యాడు. 

దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. కన్న భార్య అని చెప్పుకుంటున్న రోజా నిజానికి భార్య కాదని కన్నాచారితో సహజీవం చేస్తోందని తెలిసింది.  హత్య జరిగిన రోజు రాత్రి కన్నాచారి, స్నేహితులతో పాటు రోజా కూడా మద్యం తాగింది.

ఆ తరువాత గొడవ మొదలయ్యింది. అది పెద్దది కావడంతో కంకర రాయి, రీపర్ కర్రలతో రోజా, స్నేహితులు కన్నాచారిపై దాడి చేశారు. ఈ దాడిలో కన్నకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడికక్కడే మృతి చెందాడు. అది తెలుసుకుని వారు అక్కడినుండి పరారయ్యారని పోలీసులు తెలిపారు.

డీఎస్పీ వీరరాఘవరెడ్డి నేతృత్వంలో సీఐలు రెడ్డప్ప, జాకీర్ హుసేన్, ఎస్సై నాగమధు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో పెనుకొండ పట్టణానికి చెందిన రోజా, అనంతపురం జనశక్తినగర్ కు చెందిన బాబయ్య, మస్తాన్, నూర్ మహమ్మద్, ఒకటో రోడ్డుకు చెందిన సాకే గుణ ఉన్నారు.