నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్ధిని పట్టుబట్టింది.ఈ విషయమై ఏం చేయాలోననే విషయమై ట్రిపుల్ ఐటీ  అధికారులు తలలు పట్టుకొన్నారు.

నూజివీడు ట్రిపుల్ ఐటీలో పి. జ్యోత్స్న చదువుకొంటుంది. ఆమె స్వగ్రామం గుంటూరు జిల్లా వెల్లటూరు.  ఏడాది క్రితం ఇంటర్న్‌షిప్‌కు విజయవాడకు వెళ్లిన సమయంలో  మోహన మురళితో ఆ విద్యార్థినికి పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం ప్రేమగా మారింది. మోహనమురళిది  ప్రకాశం జిల్లా కనిగిరి స్వగ్రామం. మోహనమురళి ఎంబీఏ చదివి ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. అదే సమయంలో  మోహన‌మురళితో కుమార్తె ప్రేమ విషయం తండ్రికి తెలిసింది.ఈ విషయమై ఆయన కూతురును పలుమార్లు మందలించాడు.

శనివారం నాడు పరీక్షలు పూర్తయ్యాయి. ట్రిపుల్ ఐటీకి సెలవులిచ్చారు. దీంతో జ్యోత్న్సను తీసుకెళ్లేందుకు తండ్రి ప్రయత్నిస్తే కూతురు ఒప్పుకోలేదు. తాను ప్రేమించిన యువకుడితోనే వెళ్తానని పట్టుబట్టింది.

ట్రిపుల్‌ ఐటీ అధికారులు కూడా ఎంత చెప్పినా ఆమె వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నూజివీడు సీఐ మిద్దే గీతారామకృష్ణ సైతం వెళ్లి ఆ అమ్మాయికి కౌన్సెలింగ్‌ చేశారు. కానీ ఆ విద్యార్ధిని మాత్రం తాను ప్రేమికుడితోనే వెళ్లానని తెగేసి చెప్పింది. తండ్రితో వెళ్తే వేరే అబ్బాయితో తన పెళ్లి చేస్తారని ఆ యువతి ఆందోళన చెందుతోంది.