ఎవరికీ ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండానే మొన్న 18వ తేదీనుండి కూల్చివేతలు మొదలుపెట్టేసారు. సమావేశం పెట్టి నష్టపరిహారం విషయంలో ఎటువంటి హామీని ఇవ్వలేదు, ఒప్పందాలపై సంతకాలూ తీసుకోలేదు. పదుల సంఖ్యలో పొక్లైనర్లు, జెసిబిలను పెట్టి యుద్ధ ప్రాతిపదికన కూల్చేస్తున్నారు. అధికారుల అత్యుత్సాహంలో రోడ్లపై ఉన్న విద్యుత్ స్తంబాలు, షాపులకు, ఇళ్ళకున్న విద్యుత్ వైర్లు కూడా తెగిపోతున్నాయి. ఏ పార్టీ అయినా బాధితులకు ఇవ్వాల్సినదానికన్నా నష్టపరిహారం ఎక్కువిచ్చి జరగబోయే ఉపఎన్నికలో లబ్దిపొందుదామని చూస్తుంది. కానీ టిడిపి వ్యవహారం రివర్స్ గేరులో ఉండటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఉపఎన్నిక ముందు నంద్యాలలో అధికారపార్టీ ఎందుకు చెత్త నెత్తినేసుకుంటోందో అర్ధం కావటం లేదు. పట్టణంలో రోడ్ల విస్తరణ డిమాండ్ చాలా కాలంగా వినబడుతోంది. అయితే, ఏ ప్రభుత్వమూ సమస్యను పట్టించుకోలేదు. హటాత్తుగా ఉపఎన్నికకు ముందు విస్తరణ పేరుతో కట్టడాలను కూల్చేస్తూ టిడిపి ఎందుకు ఇంత హడావుడి చేస్తోందో అర్ధం కావటం లేదు. ఎక్కడైనా కట్టడాలను కూల్చేముందే ఆస్తులను కోల్పోయేవారికి నష్టపరిహారం ఎంత ఇవ్వాలో కూడా నిర్ణయమవుతుంది. ఆ మేరకు బాధితలనుండి ప్రభుత్వం ముందస్తుగా ఒప్పందాలు కూడా చేసుకుంటుంది.
అయితే, నంద్యలలో అటువంటిదేమీ జరిగలేదు. కూల్చాల్సిన షాపులకు, ఇళ్ళకు మార్కింగ్ వరకూ ఎప్పుడో చేసారు. కానీ మళ్ళీ అధికారులు వాటి జోలికి వెళ్లలేదు. ఉపఎన్నికల హడావుడిలో మళ్ళీ రోడ్ల విస్తరణ అంశం తెరమీదకు వచ్చింది. బాధితులతో అధికారులు మాట్లాడుతూ ఒక సమావేశం ఏర్పాటు చేసి అన్నీ విషయాలు మాట్లాడుకుందామని చెప్పారు. అధికారులు చెప్పినదాని ప్రకారం శనివారం అంటే ఈరోజు నుండి కూల్చివేతలు మొదలవ్వాలి. కానీ జరిగిందేంటి? ఎవరికీ ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండానే మొన్న 18వ తేదీనుండి కూల్చివేతలు మొదలుపెట్టేసారు.
సమావేశం పెట్టి నష్టపరిహారం విషయంలో ఎటువంటి హామీని ఇవ్వలేదు, ఒప్పందాలపై సంతకాలూ తీసుకోలేదు. పదుల సంఖ్యలో పొక్లైనర్లు, జెసిబిలను పెట్టి యుద్ధ ప్రాతిపదికన కూల్చేస్తున్నారు. అధికారుల అత్యుత్సాహంలో రోడ్లపై ఉన్న విద్యుత్ స్తంబాలు, షాపులకు, ఇళ్ళకున్న విద్యుత్ వైర్లు కూడా తెగిపోతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవటంలేదు, స్ధానికులు గోల పెడుతున్నా లెక్క చేయటం లేదు. ఉపఎన్నిక ముందు టిడిపి ఎందుకింత కంపు చేసుకుంటోందో అర్ధం కావటం లేదు. ఏ పార్టీ అయినా బాధితులకు ఇవ్వాల్సినదానికన్నా నష్టపరిహారం ఎక్కువిచ్చి జరగబోయే ఉపఎన్నికలో లబ్దిపొందుదామని చూస్తుంది. కానీ టిడిపి వ్యవహారం రివర్స్ గేరులో ఉండటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
అధికారుల వైఖిరికి నిరసనగా చివరకు స్ధానికులు ఆందోళనకు దిగారు. శనివారం నంద్యాలకు చంద్రబాబు వస్తున్నారు. సిఎం పాల్గొనే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటామనే హెచ్చరికల వరకూ పరిస్ధితి వచ్చింది. ఎటువంటి నోటీసులూ ఇవ్వకుండానే, నష్ట పరిహారం ఇవ్వకుండానే తమ షాపులు కూల్చివేయటమేంటని బాధితులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. బాధితులకు ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు తోడయ్యాయి. దాంతో నంద్యాలలో పరిస్ధితి గందరగోళంగా తయారైంది. వ్యవహారం చూస్తుంటే టిడిపికి ఎదురుదెబ్బ తప్పదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
