ఆర్బిఐ ఎందుకు వివక్ష పాటిస్తోందో అర్ధం కావటం లేదు. 40 ఇయర్స్ ఇండస్ట్రి చంద్రబాబు ఏమి చేస్తున్నారో?

ఆంధ్ర ఉద్యోగులు మాత్రం ఏం పాపం చేసారు ? తెలంగాణా ఉద్యోగులు తమ జీతంలో రూ. 10 వేలను నగదు రూపంలో అందుకోనున్నారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు అంగీకరించింది. దేశమంతా నోట్ల కష్టాలతో అల్లాడుతున్న నేపధ్యంలో తెలంగాణా ఉద్యోగులకు ఈ మాట నిజంగా ఊరట కలిగించేదే. మరి, అదే పద్దతిలో ఏపి ఉద్యోగులకు మాత్రం అదే సౌకర్యాన్ని ఎందుకు కల్పించలేదు. ఆర్బిఐ ఎందుకు వివక్ష పాటిస్తోందో అర్ధం కావటం లేదు. 40 ఇయర్స్ ఇండస్ట్రి చంద్రబాబు ఏమి చేస్తున్నారో?

ప్రస్తుతం ఏ బ్యాంకుకు వెళ్లినా క్యాష్ లేదనే సమాధానమే వినిపిస్తోంది. పేరుకు మాత్రమే వారానికి ప్రతీ ఖాతాదారుకు రూ. 24 వేలు ఇస్తున్నట్లు ప్రకటన. కానీ వాస్తవమేమిటంటే ఖాతాదారుకు రూ. 2 వేల కన్నా జాతీయ బ్యాంకులు ఇవ్వటం లేదు.

ఈ నేపధ్యలోనే నవంబర్ నెల జీతాన్ని అందుకునే రోజు వచ్చేసింది. దాంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. అయితే తెలంగాణా ఉద్యోగ సంఘాలు ప్రత్యక్షంగాను, ప్రభుత్వం పరోక్షంగా చేసిన కృషి ఫలితంగా ప్రతీ ఉద్యోగికి వారి జీతంతో నిమ్మితం లేకుండా రూ. 10 వేల వరకూ నగదు చేతికి ఇవ్వాలని రిజర్వ్ బ్యాంకు నిర్ణయించింది.

అంత వరకూ బాగానే ఉంది. మరి, ఏపి ఉద్యోగులు మాత్రం ఏం పాపం చేసారు. తెలంగాణా ఉద్యోగుల పాటి ఏపి ఉద్యోగ సంఘాలు చేయలేకపోయాయా. పైగా ఇపుడు సిఎం చంద్రబాబునాయడు ముఖ్యమంత్రుల కమిటికి కన్వీనర్ కూడా. తన పలుకుబడిని ఉపయోగించి అదే రూ. 10 వేలు ఏపి ఉద్యోగులకు కూడా అందేట్లు ఎందుకు చేయలేకపోయారో ఉద్యోగులకు అర్ధం కావటం లేదు.