Asianet News TeluguAsianet News Telugu

‘కాగ్’ నివేదికపై స్పందనేది?

ప్రభుత్వంలోని డొల్లతనాన్ని ఎత్తిచూపటంతో చంద్రబాబు ప్రభుత్వానికి దిమ్మతిరిగిపోయింది. ఒక్కరంటే ఒక్కరు కూడా నోరెత్తి కాగ్ నివేదిక తప్పని చెప్పలేదు.

Why Naidu govt is keeping mum over CAG report

‘చంద్రబాబునాయుడు బెస్ట్ సిఎం’..‘ఏపి బెస్ట్ ప్రామిసింగ్ స్టేట్’...‘ప్రపంచదేశాలన్నీ పెట్టుబడుల కోసం ఏపి వైపే చూస్తున్నాయ్’-చంద్రబాబు...‘పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్రం ఏపి’...ప్రపంచబ్యాంక్. విద్యుత్ సంస్ధకు ఎన్నో అవార్డులు. ఇవన్నీ గడచిన మూడేళ్ళుగా చంద్రబాబునాయుడు పరిపాలనకు మెచ్చి  వచ్చిన అవార్డులు. మొత్తం ప్రపంచమే చంద్రబాబు పానలకు మెచ్చి సాగిలపడుతోందన్నట్లు ఒకవైపు బ్రహ్మాండమైన ప్రచారం జరుగుతోంది. తమ ప్రభుత్వం అత్యంత పారదర్శక ప్రభుత్వమని స్వయంగా చంద్రబాబే చెప్పుకుంటున్నారు. అదేంటి మరి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రభుత్వానికి తలంటేసింది. ఏ శాఖ తీసుకున్నా అవినీతిమయమేనన్నట్లుగా కుండబద్దలు కొట్టేసింది.

సాగునీటి రంగంలో సుమారు రూ. 400 కోట్ల అవినీతి జరిగిందని కాగ్ స్పష్టంగా నివేదిక ఇచ్చింది. పైగా 2016-17లో రాష్ట్రం అప్పులు రూ. 1.8 లక్షల కోట్ల చేరుకున్నట్లు చెప్పింది. ఎఫ్ఆర్బిఎం పరిధిని మించి ప్రభుత్వం అప్పులు చేయటాన్ని  కాగ్ తీవ్రంగా ఆక్షేపించింది. ఇక, 24 గంటలూ తిరిగే హెలికాప్టర్ ను అద్దెకు ఇచ్చిన సంస్ధకు కూడా నిబంధనలు అతిక్రమించి కూ. 14 కోట్లు అదనపు చెల్లింపులు చేయటాన్నీ తప్పుపట్టింది. ఆడంబరాలకు ఖర్చులు అపరిమితంగా పెట్టడాన్ని కూడా తప్పు పట్టింది. గడచిన మూడేళ్లల్లో కోటి రూపాయలు కూడా ఏ దేశం నుండీ పెట్టుబడులూ వచ్చిన దాఖలా లేవు.

విదేశీ సంస్ధలేవీ రాష్ట్రంలో ఒక్క యూనిట్ కూడా పెట్టినట్లు కనబడలేదు. ఏవైనా అంటే శ్రీసిటిని చూపిస్తారు. శ్రీసిటి వైఎస్ హయాంలో ఏర్పడిన సెజ్. మొత్తం మీద ఆర్భాటాలు, పటోటోపాలతోనే చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు కాగ్ బయటపెట్టింది. ప్రభుత్వంలోని డొల్లతనాన్ని ఎత్తిచూపటంతో చంద్రబాబు ప్రభుత్వానికి దిమ్మతిరిగిపోయింది. ఒక్కరంటే ఒక్కరు కూడా నోరెత్తి కాగ్ నివేదిక తప్పని చెప్పలేదు. కాగ్ నివేదిక చూస్తే ప్రతీ విభాగం, ప్రతీశాఖ అవినీతి మయమే అన్నట్లుంది. వాస్తవ పరిస్ధితి ఇలావుంటే గడచిన మూడేళ్లల్లో చంద్రబాబుకు ఇన్ని అవార్డులు ఎందుకు వచ్చినట్లు?

Follow Us:
Download App:
  • android
  • ios