Asianet News TeluguAsianet News Telugu

రాజధానికి నిజంగా అడ్డెవరు?

ప్రభుత్వ ఒంటెత్తు పోకడల వల్లే రాజధాని నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. తాను చేస్తున్న తప్పుల వల్లే జాప్యం జరుగుతోందని అంగీకరించే స్ధితిలో చంద్రబాబు  లేరు. అందుకు ఎవరో ఒకరిని బలిపశువును చేయాలి కాబట్టి ఎదుటివారిపై గుడ్డకాల్చి మీదేసేస్తున్నారు. 

 

Why amaravati construction is being delayed

రాజధాని నిర్మాణానికి నిజంగా అడ్డు ఎవరు? ఇపుడు ఈ ప్రశ్నే హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే, రాజధాని నిర్మాణానికి ప్రతిపక్షాలే అడ్డు పడుతున్నాయంటూ చంద్రబాబునాయుడు అండ్ కో ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తున్నాయి. మరి, చంద్రబాబు ఆరోపణలు నిజమేనా? ప్రతిపక్షం వల్లే ఫలానా పని చేయలేకపోతున్నట్లు ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రభుత్వమైనా ఇప్పటి వరకూ చెప్పిందా? మరి ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వమే ఎందుకు అలా చెబుతోంది? అంటే దానికి కొన్ని కారణాలున్నాయి.

రాజధాని నిర్మాణం మొదలవుతుందో లేదో తెలీదు గానీ కోర్టు ఖర్చుల కోసం సిఆర్డిఏ కోట్ల  రూపాయలు తగలేస్తోంది. ప్రతి అంశమూ కోర్టు పరిధిలోకి వెళుతుండటంతో రాష్ట్ర పరువు గంగలో కలిసిపోతోంది. భూ సేకరణ, పర్యావరణ ప్రభావం, కొండవీటి వాగు ముంపు ప్రాంతం, ఆర్కిటెక్టులను ఇష్టానికి మార్చేయటం లాంటి అనేక చర్యల వల్ల ప్రభుత్వం కోర్టు కేసులను ఎదుర్కొంటోంది. ప్రతీ విషయంలోనూ ప్రభుత్వం ఏకపక్షంగా వెళుతున్న కారణంగానే అందరూ న్యాయస్ధానాలను ఆశ్రయిస్తున్నారు. దాంతో ప్రతీ కేసు విచారణకు వస్తోంది. దాంతో రాజధాని నిర్మాణ ప్రక్రియ నత్తన తలపిస్తోంది.

స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అనుసరించాలని చంద్రబాబు అనుకున్నారు. ఆ విధానంలో లోపాలున్నాయని, అవినీతికి అవకాశం ఉంది కాబట్టి ఓపెన్ టెండర్ విధానాన్ని పాటించమని కోర్టు చెప్పింది. అయినా చంద్రబాబు వినకుండా తాజాగా స్విస్ ఛాలెంజ్ విధానానికి మొగ్గు చూపారు. గతంలో ఈ విషయంలోనే నెలల తరబడి జాప్యం జరిగింది.

ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ళయినా ఇంత వరకూ రాజధాని నిర్మాణానికి సంబంధించి డిజైన్లే ఫైనల్ కాలేదు. ఎంతోమంది డిజైనర్లను మార్చారు. జపాన్ సంస్ధ మాకీ వివాదం అందరికీ తెలిసిందే కదా? చివరకు ఆ వివాదం కోర్టు మెట్లు కూడా ఎక్కుతోంది. డిజైన్ల ఎంపికలో తెరవెనుక వ్యవహారాలను మాకీ సంస్ధ రచ్చకీడ్చి రోడ్డున పడేసింది. ఇప్పటికి ఎందరు ఆర్కిటెక్టులు మారారో?

ఇక, భూ సేకరణ, పర్యావరణ ప్రభావం నివేదిక, కొండవీటి వాగు ముంపు ప్రాంతాలపై కోర్టుల్లోను, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లోను కేసులు నడుస్తున్నాయి. అంటే ప్రభుత్వ ఒంటెత్తు పోకడల వల్లే రాజధాని నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

తాను చేస్తున్న తప్పుల వల్లే జాప్యం జరుగుతోందని అంగీకరించే స్ధితిలో చంద్రబాబు  లేరు. అందుకు ఎవరో ఒకరిని బలిపశువును చేయాలి కాబట్టి ఎదుటివారిపై గుడ్డకాల్చ మీదేసేస్తున్నారు. వాస్తవం ఇదైతే, ప్రతిపక్షాల (బహాశా వైసీపీ అనేనేమో)వల్లే రాజధాని నిర్మాణం జాప్యమవుతోందని చంద్రబాబు చెప్పటంలో ఏమన్నా అర్ధముందా?

 

Follow Us:
Download App:
  • android
  • ios