సొంత బాబాయిని చంపించింది ఎవరు?.. వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్స్ పేరుతో ఫ్లెక్సీలు (వీడియో)
జగ్గయ్యపేటలో ఫ్లెక్సీ వార్ చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్ ఫ్యాన్స్ పేరుతో జగన్ కు ప్రశ్నలు సంధిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి.

ఎన్టీఆర్ జిల్లా : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేటలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఉద్దేశించి పోస్టర్లు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలు వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్స్ పేరుతో వెలియడం కలకలం రేపుతున్నాయి.
ఈ ఫ్లెక్సీల్లో...
సొంత బాబాయిని చంపించింది ఎవరు?
అక్రమ కేసులో 16 నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి ఎవరు?
సొంత తల్లిని చెల్లిని అవమానించి పార్టీ నుంచి, రాష్ట్రం నుంచి తరిమేసిన వ్యక్తి ఎవరు?
43,000 కోట్ల రూపాయలు లక్రమ ఆస్తులను సీబీఐ అండ్ ఈడీ చార్జీషీట్ లో పేర్కొన్నది ఎవరు?
ఏ1 ముద్దాయి ఎవరు?
దేశాలు, విదేశాలు పర్యటన కోసం కోర్టు అనుమతి తీసుకోవాల్సిన వ్యక్తి?
రాష్ట్రానికి శనిలా పట్టిన వ్యక్తి ఎవరు?
రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన వ్యక్తి ఎవరు?
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినడానికి కారణమైన వ్యక్తి ఎవరు?
అంటూ ప్రశ్నలు సందిస్తూ.. జగ్గయ్యపేట వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్స్ పేరుతో పోస్టర్లు వెలిశాయి. ప్రస్తుతం ఈ పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. ఇక ఈ పోస్టర్లో ఓ వైపు వైఎస్ ఫొటో.. మరోవైపు వైఎస్ వివేకా ఫొటోలు ఉన్నాయి. వైఎస్ఆర్ ఫొటో కింద.. ఇలాంటి కొడుకును కన్నందుకు చింతిస్తున్నానను అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్ మధ్యలో.. ఖైదీ గెటప్ లో.. చేతులకు సంకెళ్లతో ఉన్న జగన్ ఫొటోను పెడుతూ ఖైదీ నెంబర్ 6093 అని ముద్రించారు.
కాగా... జగ్యయ్యపేటలో ''థ్యాంక్యూ జగన్... నా ఆత్మకు శాంతి చేకూర్చావు. నన్ను చివరిదశలో అనేక అవమానాలకు, అత్యంత క్షోభకు గురిచేసి నా మరణానికి కారణమైన నీచుడు చంద్రబాబు. నేను చనిపోయాక కూడా ఆ మరణాన్ని రాజకీయాల కోసం వాడుకున్నాడు.నా కుమారుడు హరికృష్ణ, మనవడు తారకరత్న మరణాన్ని కూడా వీడి కుటిల రాజకీయాలకు వాడుకున్నాడు.
ఇలా మా కుటుంబ మరణాలను వాడుకుని నీచ రాజకీయాలు చేసిన వీడికి బుద్దిచెప్పి నా ఆత్మకు శాంతి చేకూర్చావు. నీచుడు, దుర్మార్గుడైన చంద్రబాబు జైలుకు వెళుతున్న సెప్టెంబర్ 10న ఆత్మశాంతి దినోత్సవంగా జరుపుకోవాలని తెలుగు ప్రజలను కోరుతున్నా'' అంటూ సీనియర్ ఎన్టీఆర్ సంతకంతో ప్లెక్సీలు వెలిశాయి.. ఇది జరిగిన తరువాత కొద్ది గంటల్లోనే ఇప్పుడు జగన్ మీద ఫ్లెక్సీలు వెలియడంతో పోటాపోటీ ఫ్లెక్సీ వార్ కు మరోసారి తెరలేచిందా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.