గల్లాజయదేవ్ తో పోటీపడే వైసీపీ వ్యక్తి ఇతనే. ఎవరి కొడుకో తెలుసా..?

who is srikrishna devarayulu?
Highlights

పార్టీ సీట్లు ఖాయం చేస్తున్న వైసీపీ

2019 ఎన్నికలు మరెంతో దూరంలో లేవు.  ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత జగన్ మాష్టర్ ప్లాన్ వేస్తున్నారు. దీనిలో భాగంగానే.. ఏ సీటు ఎవరికి ఇవ్వాలనే విషయంపై కూడా కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే పలువురి పేర్లను కూడా ప్రకటించారు. అలా ప్రకటించిన వారిలో ఒకరి పేరు విస్తృతంగా వినపడుతుంది. ఆయనే లావు శ్రీకృష్ణ దేవరాయలు.

ఇంతలా ఆయన పేరు ఎందుకు వినపడుతోందో తెలుసా..? టీడీపీ నేత, ఎంపీ గల్లా జయదేవ్ కి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగనున్నారు. దీంతో.. ఎవరా ఆ శ్రీకృష్ణ దేవరాయులు అంటూ అందరూ ఆయన పేరును తెగ వెతికేస్తున్నారు.

హీరో మహేష్ బాబుకి గల్లా జయదేవ్ స్వయానా బావ. జిల్లాలోనూ గల్లా ఫ్యామిలీకి మంచి పేరు ఉంది. దీంతో.. గల్లాకి పోటీగా ఎవరు నిలబెట్టాలని జగన్ బాగా ఆలోచించి మరీ శ్రీకృష్ణ దేవరాయులి పేరు ప్రకటించారు. విజ్ఞాన్‌ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడే ఈ లావు శ్రీకృష్ణ దేవరాయులు. వీరి కుటుంబానికి కూడా జిల్లాలో మంచి పేరే ఉంది.

గుంటూరు జిల్లాలో విజ్ఞాన్‌ విద్యా సంస్థల గురించి తెలియని వాళ్లు ఉండరు. టీవల ఈ జిల్లాలో జగన్‌ పాదయాత్రలో శ్రీకృష్ణదేవ రాయలు చురుగ్గా పాల్గొనడంతోపాటు అన్ని విధాలుగా అండదండలు అందించారు. అందుకే గల్లాకి గట్టి పోటీ కేవలం ఇతను మాత్రమే ఇవ్వగలడని జగన్ భావించినట్లు సమాచారం.

loader