అపచారం చేయించిన ‘అజ్ఞాతవాసి’ ఎవరు?

First Published 7, Jan 2018, 11:28 AM IST
Who is behind vijayawada Durga gudi kshudra pujas
Highlights
  • విజయవాడ కనకదుర్గ ఆలయంలో తాంత్రికపూజలు జరిగిన విషయం వాస్తవమని తేలిపోయింది.

విజయవాడ కనకదుర్గ ఆలయంలో తాంత్రికపూజలు జరిగిన విషయం వాస్తవమని తేలిపోయింది. పైకి అందరికీ కనబడుతున్నది ఈవోనే అయినా ఆమె వెనకాల ఎవరో ‘అజ్ఞాతవాసి’ ఉన్నారన్నది స్పష్టం. ఇపుడు తేలాల్సింది ఆ అజ్ఞాతవాసి ఎవరన్నదే.  అందరికీ కనబడుతున్నది ఇవో సూర్యకుమారే కాబట్టి బాధ్యత అంతా ఆమెదే అని ప్రభుత్వం తేల్చేసింది. మొన్నటి డిసెంబర్ 26వ తేదీన ఆలయంలో సంప్రదాయానికి విరుద్దంగా క్షుద్రపూజలు జరిగాయన్న విషయం సంచంలనం కలిగించింది. సరే, అనేక వివాదాల తర్వాత ఒత్తిళ్ళకు లొంగిన ప్రభుత్వం విచారణ చేయించింది. ఒకవైపు పోలీసులు విచారించారు. తర్వాత దేవాదాయశాఖ అంతర్గత విచారణ చేయించింది. ప్రభుత్వం కూడా ఓ కమిటీని నియమించింది.

సరే, జరిగిన అన్నీ విచారణల్లోనూ ఆలయంలో సంప్రదాయ విరుద్దంగా పూజలు జరిగినట్లు తేలింది. క్షుద్రపూజలు జరిపినట్లు పోలీసు విచారణలో పూజలో పాల్గొన్న వారు అంగీకరించినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. జరిగిందేమిటో తేలిపోయింది కానీ జరిగిన పూజలు ఎవరి కోసమన్న విషయం మాత్రం సస్పెన్స్ గానే ఉండిపోయింది. ఒకవైపు నారా లోకేష్ కోసమే చంద్రబాబు ప్రత్యేక పూజలు చేయించారని వైసిపి ఆరోపించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, చంద్రబాబుకు మద్దతుగా ఉండే మీడియా మాత్రం తనకోసమే ఈవో పూజలు జరిపించుకున్నట్లుగా వార్తలు వండి వారుస్తోంది.

ఇక్కడే అందరికీ అనుమానాలు వస్తున్నాయి. తనకోసం దుర్గగుడి లాంటి ప్రసిద్ద ఆలయంలో క్షుద్రపూజలు జరిపించుకునేంత సాహసం ఈవో చేస్తారా? పైగా పోలీసుల విచారణలో పూజారులు చెప్పింది ఏమంటే, ‘పూజలు చేస్తున్నపుడు ఫొటోలు తీసి తనకు పంప’మని ఈవో చెప్పారట. ‘ఆ ఫొటోలను తాను వేరేవారికి పంపాల’ని పూజలు చేసిన వారితో ఈవో చెప్పారట. అంటే అర్ధమేంటి? జరిగిన పూజలు ఈవో కాసం కాదని స్పష్టమవుతోంది. ఎవరికి పంపమని ఈవో ఫొటోలు తెప్పించుకున్నారు? ఇంతకీ ప్రత్యేక పూజలు జరిపించమని ఈవోకు ఆదేశాలిచ్చిన ఆ ‘అజ్ఞాతవాసి’ ఎవరో తెలుతుందా?

loader