ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి టిక్కెట్లు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బు వసూలు చేసిన వైట్ కాలర్ నేరస్తుడిని విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు వైసీపీ, టీడీపీ అధిష్టానాల వద్ద పరిచయం ఉందని ఎన్నికల సమయంలో వైసీపీ, టీడీపీ నేతలకు మోసగాడు గాలం వేశాడు.

ఈ రకంగా ఆశావహుల నుంచి లక్షలాది రూపాయలు దండుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను విశాఖ పోలీస్ కమిషనర్ మహేశ్ చంద్ర లడ్హా మీడియాకు వివరించారు. నాటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యల ఫోన్ నెంబర్లు సంపాదించిన కేటుగాడు...ముఖ్యమంత్రి పీఏని అని చెప్పి పరిచయం చేసుకునేవాడు.

వారికి టిక్కెట్లు ఇప్పిస్తానని వల విసిరాడని సీపీ తెలిపారు. ఇందుకు సంబంధించి వైసీపీ నేత హర్షవర్థన్ రెడ్డి సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని లడ్హా వెల్లడించారు.