కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిసి వారంపైగా అయిపోయినా మేయర్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ అర్దం కావటం లేదు. కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 50 డివిజన్లకు గాను వివిధ కారణాల వల్ల 48 డివిజన్లకు మాత్రమే ఎన్నికలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. మిగిలిపోయిన 2 డివిజన్లకు కుడా ఎన్నికలు జరిగితే కానీ మేయర్ ఎన్నిక జరిపేందుకు లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో కాకినాడ మేయర్ పోస్టు రిజర్వేషన్ అంశం కుడా వివాదంలో ఉంది.
‘చేతిలో ముద్ద నోట్లోకి రావటం లేద’న్నట్లుగా తయారైంది టిడిపి పరిస్ధితి. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిసి వారంపైగా అయిపోయినా మేయర్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ అర్దం కావటం లేదు. కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 50 డివిజన్లకు గాను వివిధ కారణాల వల్ల 48 డివిజన్లకు మాత్రమే ఎన్నికలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో టిడిపికి తిరుగుబాటు అభ్యర్ధులతో కలిపి 35 డివిజన్లు దక్కాయి. వైసీపీ 10 డివిజన్లు గెలవగా భారతీయ జనతా పార్టీ 3 డివిజన్లు గెలిచింది. ఎన్నికలు పెండింగ్ లో పడిన రెండు డివిజన్లే టిడిపికి పెద్ద సమస్యగా మారింది.
కార్పొరేషన్ పై కోర్టులో కేసు ఎప్పటికి ముగుస్తుందో తెలీదు. అదే విషయాన్ని గురువారం కోర్టు ప్రస్తావిస్తూ మిగిలిపోయిన 2 డివిజన్లకు కుడా ఎన్నికలు జరిగితే కానీ మేయర్ ఎన్నిక జరిపేందుకు లేదని స్పష్టం చేసింది. దాంతో టిడిపిలో ఒక్కసారిగి నిరాస ఆవహించింది. నిజానికి మేయర్ ఎన్నికకు, రెండు డివిజన్లలో ఎన్నిక పెండింగ్ లో పడటానికి ఎటువంటి సంబంధమూ లేదు. మేయర్ ఎంపికలో ఎన్నిక జరగని రెండు డివిజన్లే కీలకంగా ఉంటే అప్పుడు ఎలాగూ ఎన్నిక నిర్వహించక తప్పదు. కానీ ఇక్కడ టిడిపికి క్లియర్ మెజారిటీ ఉంది.
నిజానికి మిగిలిపోయిన రెండు డివిజన్లతో టిడిపికి పనే లేదు. ఒకవేళ ఆ రెండు డివిజన్లలో టిడిపి గెలిచినా ఒకటే, ఓడినా ఒకటే. కానీ జిహెచ్ఎంసి చట్టంలోని సెక్షన్ 90, ఏపి మున్సిపల్ కార్పొరేషన్ రూల్స్ ప్రకారం అన్నీ డివిజన్లకు ఎన్నికలు జరిగితే కానీ మేయర్ ఎన్నిక జరిపేందుకు లేదు. గురువారం ముగిసిన వాదనలు శుక్రవారం కుడా జరుగుతాయి. అదే సమయంలో కాకినాడ మేయర్ పోస్టు రిజర్వేషన్ అంశం కుడా వివాదంలో ఉంది. దీనిపై ఎప్పుడు విచారణ జరుగుతుందో ఏమో. వీలైనంత తొందరగా వివాదాలను పరిష్కరించుకుని మేయర్ ఎన్నిక జరుపుకోవాలని టిడిపి ఆతృత పడుతోంది. కాకినాడ కార్పొరేషన్లో టిడిపి జెండా ఎప్పటికి ఎగురుతుందో ఏమో?
