కర్నూలు వైసీపీ ఎంపి బుట్టా రేణుక టిడిపిలో చేరే విషయం దాదాపు ఖాయంగా తెలుస్తోంది. అయితే, ఇక్కడే కొన్ని మౌళికమైన ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయ్. అంత భారీ ప్యాకేజితో టిడిపిలోకి చేర్చుకునేంత సీన్ రేణుకకు ఉందా అన్నదే అనుమానం. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో సామాజికవర్గ సమీకరణల్లో భాగంగా కర్నూలు ఎంపిగా టిక్కెట్టు దక్కించుకున్నది. అదృష్టం బాగుండి గెలిచింది. అంతేకానీ నియోజకవర్గంలో పట్టుండో లేకపోతే కుటుంబ నేపధ్యం వల్లో గెలిచిన వ్యక్తి కాదన్న విషయం అందరికీ తెలిసిందే.

కర్నూలు వైసీపీ ఎంపి బుట్టా రేణుక టిడిపిలో చేరే విషయం దాదాపు ఖాయంగా తెలుస్తోంది. అయితే, ఇక్కడే కొన్ని మౌళికమైన ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయ్. జరుగుతున్న ప్రచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో బుట్టాకు టిడిపి టిక్కెట్టిచ్చి ఎన్నికల ఖర్చు మొత్తం పెట్టుకుంటుందట. తక్షణ ప్రయోజనం క్రింద రూ. 70 కోట్లు అందించటంతో పాటు పలు కాంట్రాక్టులు కూడా ఇవ్వటానికి చంద్రబాబునాయుడు సానుకూలంగా ఉన్నారన్నది ప్రచారం.

ప్యాకేజి బాగానే ఉంది కానీ, అసలు అంత భారీ ప్యాకేజితో టిడిపిలోకి చేర్చుకునేంత సీన్ రేణుకకు ఉందా అన్నదే అనుమానం. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో సామాజికవర్గ సమీకరణల్లో భాగంగా కర్నూలు ఎంపిగా టిక్కెట్టు దక్కించుకున్నది. అదృష్టం బాగుండి గెలిచింది. అంతేకానీ నియోజకవర్గంలో పట్టుండో లేకపోతే కుటుంబ నేపధ్యం వల్లో గెలిచిన వ్యక్తి కాదన్న విషయం అందరికీ తెలిసిందే.

అటువంటి వ్యక్తి గెలిచిన దగ్గర నుండి టిడిపి నేతలతో సన్నిహిత సంబంధాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అందుకనే పలుమార్లు బుట్టా టిడిపిలోకి ఫిరాయించేస్తారన్న ప్రచారం జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఆమె ఖండిస్తూనే ఉన్నా ఎంపి మాటలపై ఎవ్వరికీ నమ్మకం లేదు. సరే, తాజాగా వైసీపీ మీడియాలోనే బుట్టా ఫిరాయింపు గురించి శనివారం ఓ పెద్ద కథనమే వచ్చింది కాబట్టి నిజమే అని అనుకుందాం.

పోయిన ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తుందన్న నమ్మకమేంటి? మొన్న జరిగిన నంద్యాల ఉపఎన్నికల్లో టిడిపి భారీ మెజారిటీతో గెలిచింది. కాబట్టి అదే సీన్ మళ్ళీ రిపీటవుతుందన్న నమ్మకంతోనే బుట్టాను టిడిపిలోకి చేర్చుకుంటున్నారా? ఒకవేళ అదే నిజమైతే అందుకు టిడిపిలో ప్రస్తుతమున్న నేతలెవరైనా సరిపోతారు కదా? భారీ ప్యాకేజి ఇచ్చి బుట్టానే లాక్కోవటమెందుకు?

ఎందుకంటే, వైసీపీలో ఇమడలేక, జగన్ ఒంటెత్తు పోకడలు నచ్చకే టిడిపిలో చేరుతున్నట్లు రేణుకతో ఓ ప్రకటన ఇప్పిస్తారేమో. ఇప్పటి వరకూ టిడిపిలోకి ఫిరాయించిన వాళ్ళు చెప్పిన మాటలవే కాబట్టి. దానివల్ల జగన్ కు వచ్చే నష్టమేంటి? ఏం లేదనే సమాధానం వస్తోంది. ఎందుకంటే, ఫిరాయించిన ఎంఎల్ఏలు చెప్పినా జగన్ కు అయిన డ్యామేజి ఏం లేదు. రేపు బుట్టా చెప్పినా ప్రభావం ఏమీ ఉండదు.

కాకపోతే ఓ నాలుగు రోజులు జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంది. నవంబర్ 2వ తేదీ నుండి జగన్ పాదయాత్ర మొదలవుతోందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో బుట్టాను టిడిపిలోకి చేర్చుకుని జగన్ ను మానసికంగా దెబ్బతీసామని టిడిపి నేతలు ఆనందించేందుకు తప్ప ఇంకెందుకు ఉపయోగ పడదు.