రోజా వ్యవహారం ప్రతీ రోజూ ఏదో ఓ రూపంలో ప్రజల్లో నానుతూనే ఉంది. ప్రతిపక్షానికి అంతకన్నా కావాల్సిందేముంటిది?

చంద్రబాబునాయడు ప్రభుత్వం రోజా వ్యవహారంలో వైసీపీకి బాగానే దొరికిపోయింది. అందులోనుండి బయటపడటానికి ఇపుడు నానా తంటాలు పడుతోంది. ప్రభుత్వ తీరు ‘అడుసుత్రొక్కనేల కాలు కడుగనేల’ అన్న సామెతకు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా మార్కులు కొట్టేద్దామని చంద్రబాబు ప్రభుత్వం మహిళా పార్లమెంటేరియన్ సదస్సు జరిపింది. దేశ, విదేశాల నుండి ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అయితే, మార్కులు వచ్చిందీ లేనిదీ తెలీదు కానీ అప్రతిష్ట మాత్రం మూటగట్టుకున్నది బాగానే. సదస్సులో హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ ఎంఎల్ఏ రోజాను అరెస్టు చేయటంతో ప్రభుత్వ పరువు కృష్ణా నదిలో కిలిసిపోయింది. అంతకుముందే, సదస్సు నిర్వహణను భుజాల మీద మోసిన స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా ‘మహిళలు-వాహనాలం’టూ చేసిన దిక్కుమాలిన పోలిక కూడా చాలా అప్రదిష్ట తెచ్చింది. ఒకదానికి వెంబటే మరొకటి జరగటంతో ప్రభుత్వం బాగా ఇబ్బంది పడింది.

ప్రభుత్వం బాగా అప్రదిష్ట మూటగట్టుకున్నది కాబట్టే చంద్రబాబు, కోడెల ఇంకా అవే సంఘటనలను పదే పదే ప్రస్తావిస్తున్నారు. సదస్సు తర్వాత రోజా పోలీసు అధికారులపై గన్నవరం కోర్టులో కేసు దాఖలు చేసింది. దాని తర్వాతే పోలీసు అధికారుల సంఘం రంగంలోకి దిగింది రోజాకు కౌంటర్గా. అయితే, రోజా ఏమాత్రం బెదరలేదు. పైగా సంఘం నేతల తనపై చేసిన వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కొంటోంది. దాంతో సంఘం నేతల నుండి సమాధానం లేదు. దాంతో రోజా వ్యవహారం ప్రతీ రోజూ ఏదో ఓ రూపంలో ప్రజల్లో నానుతూనే ఉంది. ప్రతిపక్షానికి అంతకన్నా కావాల్సిందేముంటిది?