వైసీపీకి మద్దతు విషయంలో పవన్ వైఖరేంటి: బొండా ఉమా

what is your stand on ysrcp asks TDP MLA Bonda Uma asks to Pawan kalyan
Highlights

పవన్ పై బొండా ఉమా హట్ కామెంట్స్

విజయవాడ:వైసీపీకి మద్దతు విషయమై తన వైఖరేమిటో  పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని  టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్ రావు అభిప్రాయపడ్డారు.  పవన్ కళ్యాణ్ ఎటువైపు ఉంటారో కూడ తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

శుక్రవారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అభివృద్ది వైపు ఉంటారా,  అరాచకం వైపు  పవన్ కళ్యాణ్ ఉంటారా అనే విషయమై స్పష్టత ఇవ్వాలని  డిమాండ్ చేశారు.  వైసీపీ చీప్ వైఎస్ జగన్ పాదయాత్రకు స్పందన లేని కారణంగానే  జనసేనతో జట్టు కట్టాలని జగన్ భావిస్తున్నారేమోనని ఆయన ఎద్దేవా చేశారు.

జగన్, పవన్ కళ్యాణ్ లు కలిసినా తమకు ఇబ్బందేమీ లేదని  బొండా ఉమా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎవరితో వెళ్తారనే విషయమై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని  బొండా ఉమా కోరారు.

వైసీపీ , జనసేన, బిజెపిలు  కలిసి టిడిపిపై కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా ఆ, కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు.

loader